Telangana News: మంథనిలో బీఆర్ఎస్‌కు షాక్... చల్లా నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసినా.. పార్టీలో సరైన గుర్తింపు లేదన్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న అభ్యర్థికి, రౌడీ రాజకీయం చేసేవారికి టికెట్ కేటాయించడం కలిచి వేసిందన్నారు.

Telangana News: మంథనిలో బీఆర్ఎస్‌కు షాక్... చల్లా నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా
New Update

రాజీనామా అనంతరం వారు మాట్లాడుతూ.. చల్లా నారాయణరెడ్డి అనే నేను, మీ పిలుపు మేరకు అప్పటి BRS పార్టీలో 2017లో చేరడం జరిగిందన్నారు. నేను అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటారం మండల జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నానన్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి ఈ రోజు వరకు బీఆర్ఎస్‌ కోసం అంకిత భావంతో, చిత్తశుద్ధితో పని చేశానని ఆయన తెలిపారు. కానీ.. నా అనుభవాన్ని, సుదీర్ఘ 40 ఏళ్ల రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకొని అయిన నాకు పార్టీ సముచిత స్థానం కల్పించలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను.

బీఆర్ఎస్‌ పార్టీలో గుర్తింపు లేదు

2018 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి BRS పార్టీ అభ్యర్థి ఓడిపోయినా తర్వాత 2019లో కమాన్‌పూర్ జడ్పీటీసీగా టికెట్ ఇచ్చిన తర్వాత పూర్తి నిబద్దతతో పని చేసి గెలవని సీట్‌ని నా పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తిగా అక్కడ మీరు నిలబెట్టిన అభ్యర్థని గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించానని ఆయన వివరించారు. దాని తర్వాత వచ్చిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పని చేసి మంథని మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌ పార్టీ జెండా ఎగురవేశ కానీ కనీసం గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇటీవలే 2023 ఎన్నికల్లో మంథని నియోజకవర్గ టికెట్ కేటాయించిన తీరు నన్ను, మంథని ప్రజలను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. నడి రోడ్డు మీద వామన్‌రావు లాయర్ దంపతులను హత్య చేపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దళిత యువకుడి మర్మాంగాలను కోసి చంపించారని ఫైర్‌ అయ్యారు.

ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువైయ్యాయి

నాకు ఎదురు ఎవరు లేరని నియంత పాలన చేస్తున్న వారిని కనీస చర్యలు తీసుకోకుండా మళ్ళీ కీలక నేతలకే ఎమ్మెల్యే టికెట్ బాధ్యతలు అప్పగించి ప్రోత్సహింస్తున్నారని ఫైర్‌ అయ్యారు. మంథని రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు తలిపిస్తున్నాయన్నారు చల్లా నారాయణ రెడ్డి. ఇక్కడి ప్రజలు భయం గుప్పిట్లో వున్నారని వారికి స్వేచ్చా పాలనను అందించేందుకు ముందుకు వెళ్తున్నానని ఆయన చెప్పారు. నియంత పాలనలో పనిచేసే అవకాశం లేదని అందుకే బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు.  నేను మంథనిలో “గడప గడపకు మన నారాయణన్న” కార్యక్రమంలో ప్రతీ గ్రామ గ్రామాన తిరిగి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకొని వారికి అండగ ఉన్నానున్నారు. ప్రజల్లో మార్పు మొదలైనదని తెలిపారు. మంథని ప్రజలంతా కొత్త నాయకత్వానికి నాంది పలకాలని చూస్తున్నారని అయన పేర్కొన్నారు. వారికి అండగ కష్ట సుఖాల్లో నేను తోడుంటాన్నారు. నేను నిర్ణయించిన దృష్ట్యా ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: బీజేపీపై పోరాడితే నాపై కేసులు…ఇల్లు లాక్కున్నారు: రాహుల్ గాంధీ

#manthani #primary-member-of-brs #kataram-pacs-chairman-challa-narayana-reddy #brs-senior-leaders #resigned #karimnagar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe