Neck Black: మెడ నల్లగా మారడం దేనికి సంకేతం..ఈ అవయవానికి ముప్పుతప్పదా? మెడలో నల్లగా మారడం లేదా నొప్పి రావడం కాలేయ వ్యాధి, స్ట్రోక్ వచ్చే అవకాశాలకు సంకేతం. మధుమేహం ఉన్నవారికి మెడ నల్లగా మారితే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఊబకాయం ఉన్నవారి శరీరంలోని కొన్ని భాగాలలో నల్ల మచ్చలు కూడా కనిపిస్తాయి. By Vijaya Nimma 26 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Neck Black: ఈ బిజీ లైఫ్‌లో ఆరోగ్యానికి సమయం కేటాయించడమే కష్టంగా మారింది. దాని కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మందికి మెడ నల్లగా మారుతూ ఉంటుంది. పరిశుభ్రత పాటించకపోవడమే ఇందుకు ఒక కారణం. అయితే ఇలా నల్లగా ఉండటం వల్ల కొన్ని ప్రమాదాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెడలో నలుపు: సాధారణంగా చాలా మందికి మెడ భాగంలో నల్లగా ఉంటుంది. కానీ డయాబెటిక్ పేషెంట్లకు మెడలో నల్లగా మారడం లేదా నొప్పి రావడం చాలా వ్యాధులకు సంకేతం అని వైద్యులు అంటున్నారు. మెడ నల్లగా ఉంటే కాలేయ వ్యాధి, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. లక్షణాలను ముందుగానే గమనించి అప్రమత్తంగా ఉండాలని, మధుమేహం ఉన్నవారికి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని అంటున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడం వంటివి చేయాలని నిపుణులు అంటున్నారు. డయాబెటిక్ పేషెంట్లలో మెడలో నలుపు ఉండటం ఫైబ్రోసిస్ ప్రమాదాన్ని పెంచుతుందని ఓ నివేదికలో తేలింది. నల్లని మెడ ఉన్న డయాబెటిక్ పేషెంట్లలో కాలేయం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారిలో మాత్రమే బ్లాక్ నెక్ కనిపిస్తుందని కూడా చెబుతున్నారు. మధుమేహం ఉన్నవారిలో ఈ లక్షణాలు ఉంటాయి: మధుమేహం, ఊబకాయం ఉన్నవారి శరీరంలోని కొన్ని భాగాలలో నల్ల మచ్చలు కూడా కనిపిస్తాయి. తరచుగా మూత్రవిసర్జన, బరువు తగ్గడం, చేతులు, కాళ్లలో జలదరింపు వంటి లక్షణాలు ఉంటాయి. నిజానికి డార్క్ స్పాట్‌లకు చికిత్స లేదు. ఎందుకంటే అవి వాటంతట అవే తగ్గిపోతాయి. ఒకవేళ తగ్గకపోతే చర్మ వైద్యుడిని సంప్రదించాలి. ఇది కూడా చదవండి: ఎండాకాలంలో కడుపులో వేడి ఎందుకు పెరుగుతుంది? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #diabetes #best-health-tips #neck-black మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి