KL Rahul : 'నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.. చాలా బాధపడ్డా..' కేఎల్‌రాహుల్‌ ఎమోషనల్‌!

సెంచూరియన్‌ సెంచరీ హీరో కేఎల్‌ రాహుల్‌ ఎమోషనల్ అయ్యాడు. గతంలో తనపై జరిగిన సోషల్‌మీడియా ట్రోల్స్‌ను తలుచుకోని బాధపడ్డాడు. 100 పరుగులు చేసినప్పుడు, ప్రజలు 'వావ్' అంటారని.. ఫెయిలైనప్పుడు దుర్భాషలాడారని కామెంట్ చేశాడు.

New Update
KL Rahul : 'నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.. చాలా బాధపడ్డా..' కేఎల్‌రాహుల్‌ ఎమోషనల్‌!

South Africa : లైఫ్‌ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్నీ వేళల మనకు నచ్చినట్టే అన్నీ జరగవు. జీవితంలో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు సహజం. కిందపడినప్పుడు పైకి లేపేవారు ఉన్నట్టే అంతకంటే ఎక్కువగా గెలీ చేసేవారుంటారు. అవన్ని భరించి ముందుకుసాగితేనే జీవితం.. మన పనితోనే విమర్శకుల మూతి మూయించడమే విజయం. ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌(KL Rahul) విక్టరీల బాటలో ఉన్నాడు. బ్యాటింగ్‌, కీపింగ్‌లలో రాణిస్తున్నాడు. ఐపీఎల్‌(IPL)లో గాయం తర్వాత తిరిగి వన్డే ప్రపంచకప్‌(World Cup 2023) లో రీఎంట్రీ ఇచ్చిన రాహుల్‌ మెగా టోర్నిలో సత్తా చాటినట్టే దక్షిణాఫ్రికా(South Africa) గడ్డపైనే తాను ఎంత విలువైన ప్లేయర్‌నో తన ఫ్యాన్స్‌తో పాటు విమర్శకులకు కూడా చూపిస్తున్నాడు. టీమిండియా బ్యాటర్లంతా విఫలమైన చోట సెంచరీతో కదం తొక్కిన రాహుల్‌ మ్యాచ్‌ తన ఇన్నింగ్స్‌ తర్వాత ఎమోషనల్‌ అయ్యాడు.

చాలా బాధపడ్డా:
సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 245 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ 245లో రాహుల్ ఒక్కడే 101 రన్స్ చేశాడు. అది కూడా 73 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత రాహుల్‌ విలువేంటో అందరికి అర్థమైంది. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత కేఎల్‌ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అతను గతంలో తనపై జరిగిన ట్రోల్స్‌కు ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకోవచ్చు.

'ఇది సహజంగానే చాలా కష్టం. మీరు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు, క్రికెటర్లుగా, వ్యక్తిగా, వ్యక్తిగతంగా ప్రతిరోజూ, ప్రతి క్షణం సవాలు ఎదుర్కొంటారు. సోషల్ మీడియా ఒత్తిడి ఉంటుంది. మీరు 100 పరుగులు చేసినప్పుడు, ప్రజలు 'వావ్' అంటారు. , వావ్'.కానీ 3-4 నెలల క్రితం, వారు నన్ను దుర్భాషలాడారు. ఇది ఆటలో భాగం ' అని సెంచూరియన్‌లో రెండో రోజు ఆట తర్వాత రాహుల్ కామెంట్స్ చేశాడు.

'ఇది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది, ఇది నన్ను ప్రభావితం చేయదని నేను చెప్పను, కానీ, మీరు సోషల్ మీడియాలోని నెగిటివిటీకి దూరంగా ఉంటే మీ మైండ్‌సెట్, మీ గేమ్ మెరుగ్గా ఉంటుంది.' అని చెప్పుకొచ్చాడు.

సెంచూరియన్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి ఓవర్సీస్ బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు.2021లో ఇదే సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ కొట్టాడు.

Also Read: ఫేర్‌వెల్‌ సిరీస్‌లో సెంచరీ.. సెల్యూట్‌ చేసిన కోహ్లీ.. రెండో రోజు ఆటలో ఏం జరిగిందంటే?

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు