Pooja Khedkar: పూజాకు షాక్‌..! ఆరోపణలు నిజమని తేలితే.. ఊడనున్న ఉద్యోగం

ట్రెయినీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌పై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విచారణలో పూజా ఖేద్కర్‌పై చేసిన ఆరోపణలు నిజమని తేలితే.. ఆమెను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

New Update
Pooja Khedkar: పూజాకు షాక్‌..! ఆరోపణలు నిజమని తేలితే.. ఊడనున్న ఉద్యోగం

ట్రెయినీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌కు మరిన్ని చిక్కుల్లో ఇరుక్కుంది. అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాగా.. యూపీఎస్సీకి ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారని ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ పర్సనల్ అండ్‌ ట్రైనిగ్‌ (DoPT) అదనపు కార్యదర్శి మనోజ్ ద్వివేదీ విచారణ ప్రారంభించారు. రెండు వారాల్లో దీనిపై ఆయన రిపోర్టు సమర్పించనున్నారు. అయితే ఒకవేళ ఈ విచారణలో పూజా ఖేద్కర్‌పై చేసిన ఆరోపణలు నిజమని తేలితే.. ఆమెను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే నిజాలు చెప్పకుండా ఫేక్ సర్టిఫికేట్లతో ఐఏఎస్‌ ఉద్యోగంలో చేరినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి.

Also Read: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. ఆ రోజును ‘సంవిధాన్ హత్యా దివస్’గా!

ఇదిలాఉండగా పూణెలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పూజా ఖేద్కర్‌పై ఆరోపణలు రావడం వల్ల ఆమెను వాసిమ్‌ జిల్లాకు ట్రాన్స్‌ఫర్ చేసిన విషయం తెలిసిందే. ఒక కాంట్రక్టర్ నుంచి తీసుకున్న ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నెంబర్ ప్లేట్లను పర్మిషన్ లేకుండా ఆమెపై ఫిర్యాదు చేయగా.. ఆమెకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూపీఎస్సీకి ఆమె తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చి పరీక్షలు రాశారని, ఆమెకు దృష్టిలోపం, మానసిక సమస్యలు ఉన్నట్లు చెప్పుకున్నారని ఆరోపణలు వచ్చాయి. సెలక్షన్ కమిటీ ఆమెను వైద్యపరీల కోసం ఎయిమ్స్‌కు పిలవగా..కరోన సాకుతో ఆమె వెళ్లలేదు.

చివరికి ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్‌మెంట్‌ పూర్తయింది. ఆ తర్వాత సెలక్షన్ కమిషన్‌ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ కూడా పూజా ఖేద్కర్‌ రాజకీయ పలుకుబడితో తన నియామకం కన్‌ఫర్మ్‌ చేసుకుంది. ఆమె ఓబీసీ కేటగిరి కింద సివిల్స్ పరీక్ష రాసింది. దానికి సంబంధించిన సర్టిఫికేట్‌లో కూడా తన తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలుగా రాయించుకుంది. కానీ వాస్తవానికి పూజ తండ్రి దిలీప్‌ ఖేద్కర్‌ ఒక రిటైర్ట్‌ ప్రభుత్వ అధికారి. వారి వార్షిక ఆదాయం రూ.49 లక్షలు. వాళ్లకున్న మిగతా ఆస్తులన్నీ కలిపితే ఏకంగా రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. ఓబీసీ కేటగిరి ఆదారంగానే ఆమె 841వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌ హోదాను సంపాదించగలిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ కీలకంగా మారింది. ఈ రిపోర్టు ఆధారంగానే ఆమెపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.

Also read: హథ్రాస్ తొక్కిసలాట ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ.. ఎందుకంటే

Advertisment
తాజా కథనాలు