భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం- బండి సంజయ్

బీజేపీ అధికారంలోకి రాగానే..భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ .అమ్మవారి దయవల్లే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేసే వరకు పోరాడతామని బండి సంచలన వ్యాఖ్యలు చేశారు.

భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం- బండి సంజయ్
New Update

తెలంగాణ ప్రజాలారా... ఇదే మీ అందరికీ ఇదే నా సెల్యూట్ అంటూ కేంద్ర మంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆవేశంగా మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలతో కలిసి భాగ్యలక్ష్మీ అమ్మవారిని నిన్న ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తామని ప్రకటించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయవల్లే ఈరోజు బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిందన్నారు. ఈ విషయంలో కార్యకర్తల కష్టార్జితం మరువలేనిదన్నారు. కార్యకర్తలతోపాటు బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలందరికీ ఇదే నా సెల్యూట్ అని చెప్పారు.

ఈరోజు హైదరాబాద్ వచ్చిన బండి సంజయ్ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు తదితరులతో కలిసి పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారు చాలా పవర్ ఫుల్. అమ్మవారి దయవల్లే ఆనాడు ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైందని అన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతోపాటు జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు. సామాన్య కార్యకర్తలమైన తాము ఇవాళ కేంద్ర మంత్రులుగా ఉన్నామంటే.. బీజేపీ అధిష్టానం వల్లనే వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చారు బండి. కార్పొరేటర్ కేంద్ర మంత్రి కావొచ్చని, చాయ్ వాలా ప్రధాని కావొచ్చని.. నిరూపించిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన బీజేపీని తెలంగాణలో తిరుగులేని శక్తిగా మార్చి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేదాకా పోరాడతానంటూ బండి సంజయ్ ప్రతిజ్ఞ చేశారు. నా చివరి రక్తపు బొట్టు వరకు పార్టీ కోసమే ధారపోస్తానని చెప్పారు.

Also Read:Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రూటు..భారత్ గ్యాస్ అంటూ ఫోన్లు

#bjp #bandi-sanjay #telanagna #centarl-minister #bhagya-laxmi-temple
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe