పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. దీంతో దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందిపై దాడులు పెరిగిపోతున్నాయనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం హాస్పిటల్ యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై దాడి చేసినా లేదా హింసాత్మక ఘటన జరిగినా FIR నమోదు చేయాలని సూచించింది. లేకపోతే చేయకపోతే సంస్థ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
Also Read: వివాదంలో బజరంగ్ పూనియా.. జాతీయ జెండాను అగౌరవపరిచాడంటూ విమర్శలు
మరోవైపు కేంద్రం ముందు ఇండిపెండెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ (IME) ఐదు డిమాండ్లు పెట్టింది.
1. వైద్యులు, ఆస్పత్రులపై దాడులను అరికట్టేందుకు 1897 ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్‌ను మరింత బలోపేతం చేయాలి
2. ఎయిర్‌పోర్టులకు తగ్గకుండా హాస్పిటల్స్‌లో సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను అమలు చేయాలి. సీసీటీవీ ఫుటేజ్‌లు, భద్రతా సిబ్బందిని పెంచి భద్రతా జోన్‌లుగా హాస్పిటల్స్‌ను ప్రకటించాలి.
3. కొల్‌కతా హత్యాచార బాధితురాలు 36 గంటల పాటు కంటిన్యూగా షిఫ్ట్ చేసింది. ఆమెకు కనీసం విశ్రాంతి తీసుకునేందుకు కూడా సరైన చోటు లేకపోవడం వల్లే ఈ దారుణం జరిగింది. ఇక నుంచి అలా ఉండకూడదు.
4. ఇలాంటి నేరాలపై పకడ్బందీగా విచారణ చేపట్టి.. వెంటనే వారికి కఠిన శిక్షలు వేయాలి.
5. బాధిత కుటుంబానికి తగిన పరిహారం ప్రకటించాలి