తెలంగాణ-ఏపీ-కర్ణాటక రాష్ట్రాలను లింక్ చేస్తూ నూతన జాతీయ రహదారిని నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ - బెంగళూరు మధ్య నాలుగు వరుసల రహదారి ఉంది. ఇందుకు అదనంగా కొత్త రహదారిని నిర్మించాలని కేంద్ర రవాణాశాఖ నిర్ణయించింది. 'మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్ - 2047'లో ఈ రహదారిని నిర్మించేందుకు ప్లాన్‌ను రూపొందించింది.
Also Read: కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
ఇదిలాఉండగా.. నాగ్‌పుర్ - హైదరాబాద్ - బెంగళూరు నగరాల మధ్య రాకపోకలను మరింతగా పెంచాలని రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారిలో ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గించేలా కొత్త రహదారిని అందుబాటులోకి తీసుకురావాలనేది ప్లాన్. ఇప్పటికే నాగ్‌పూర్ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి బెంగళూరును కూడా అనుసంధానించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (DPR)ను రూపొందించడం కోసం కసరత్తులు మొదలుపెట్టింది. అలాగే డీపీఆర్ తయారీకి గుత్తేదారును ఎంపిక చేసేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారులు శాఖ టెండ్లర్లకు ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు ఈ ఏడాది సెప్టెంబర్ 12ను చివరి తేదీగా నిర్ణయించింది.
Also read: కాల్ గర్ల్స్, రేప్ కేసు, డ్రగ్స్ బానిసలే టార్గెట్.. అందినంత దోచేస్తున్న ఫేక్ పోలీస్!