NEET పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది నీట్-యూజీ 2024 అభ్యర్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ 1563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్షకు అవకాశం ఇవ్వబడుతుందని కేంద్రం పేర్కొంది.

NEET: రీ ఎగ్జామ్‌లో తేలిపోయిన టాపర్లు
New Update

NEET Exam Paper Leak : నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజి పై సుప్రీం కోర్టు (Supreme Court) లో విచారణ జరుగుతోంది. కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది. ఈ క్రమంలో ఎన్టీయే (NTA) తో పాటు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది నీట్-యూజీ 2024 అభ్యర్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ 1563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్షకు అవకాశం ఇవ్వబడుతుందని కేంద్రం పేర్కొంది.


Also Read : ఓటమి తరువాత జగన్ సంచలన నిర్ణయం

అసలేం జరిగింది..

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్ కోర్సు్ల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 67 మంది విద్యార్థులకు వందశాతం (720) మార్కులు రావడంతో ఫలితాలపై అనేకమంది విద్యార్థులు, తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరీక్షను మళ్లీ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కోర్టుల్లో కూడా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి.. మోదీ ప్రభుత్వం విద్యార్థులతో ఆడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షలు

మే 5న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ -2024 పరీక్షను నిర్వహించింది. మొత్తం 24 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణకు రెండు రోజుల ముందే ఓ స్కామ్ వెలుగులోకిరావడం కలకలం రేపింది. పరుశురామ్‌ అనే ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని, తుషార్‌భట్ అనే ఒక టీచర్‌ కలిసి గుజరాత్‌కు చెందిన 16 మంది స్టూడెంట్స్‌ను నీట్‌ పరీక్షలో పాస్ చేయించడం కోసం ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.10 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పరీక్ష జరిగిన రోజు కూడా నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ అయ్యిందంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. అంతేకాదు ప్రశ్నాపత్నం ఇదేనంటూ దాని ఫొటోలు కూడా చక్కర్లు కొట్టాయి. అదేరోజున నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఆ తర్వాత పలువురు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

#supreme-court #nta #neet-2024 #neet-paper-leak
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe