Sensational Plan : రూ. 12లక్షల కోట్లు..సర్కార్ సంచలన ప్లాన్..మోదీతో అట్లుంటది మరి.!

కేంద్రంలో బీజేపీ సర్కార్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్నారు. 2029లో కూడా తామే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తూ ప్రణాళికలు రచిస్తోంది. దానికి తగ్గట్లుగానే రూ. 12లక్షల కోట్లతో ప్లాన్ సిద్ధం చేసింది. ఏంటా ప్లాన్? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి

Sensational Plan : రూ. 12లక్షల కోట్లు..సర్కార్ సంచలన ప్లాన్..మోదీతో అట్లుంటది మరి.!
New Update

Sensational Plan :  కేంద్రంలో బీజేపీ సర్కార్ మరోసారి విజయఢాంకా మోగించడం ఖాయమంటున్నారు కొందరు ప్రజలు. ప్రజలే కాదు బీజేపీ కూడా తాము అధికారంలోకి రావడం పక్కా అంటోంది. 2029లోనూ దేశంలో బీజేపీ జెండ రెపరెపలాడుతుందని ఖచ్చితంగా చెబుతోంది. దీనిలో భాగంగానే 2029కు సంబంధించి ప్రణాళికలు ఇప్పుడే రచిస్తోంది. రూ. 12లక్షల కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఏంటా ప్లాన్?తెలుసుకోవాలన్న ఆసక్తి ఉందా?అయితే ఈ స్టోరీ చదవండి.

ఇప్పుడున్న అంచనాల ప్రకారం కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే నరేంద్రమోదీ సారథ్యంలోని ప్రభుత్వం..రైల్వే రంగంలో రూ. 10లక్షల కోట్ల నుంచి రూ. 12లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత కేంద్రం రైల్వేలో 100రోజుల ప్లాన్ పెట్టుకుంది. దీనిలో భాగంగానే ప్రయాణికులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది. 24గంటల్లోనే రిఫండ్ ఇవ్వడం, రైల్వేకి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించిన యాప్ తీసుకురావడం, దేశవ్యాప్తంగా మూడు ఎకనామిక్ కారిడార్ల నిర్మాణం, స్లీపర్ వందే భారత్ రైళ్లు వంటి ఈ నిర్ణయాల్లో ఉంటాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

కేంద్రం తీసుకువచ్చే కొత్త యాప్ లో రైల్వేలకు సంబంధించిన అన్ని సౌకర్యాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. రైళ్ల లైవ్ ట్రాకింగ్, ఫుడ్, బుకింగ్, క్యాన్సలైజేషన్ ఇలా అన్నీ కూడా ఆ యాప్ లో ఉంటాయి. అంతేకాదు ఈ ప్లాన్ లో ఓ ఇన్సూరెన్స్ స్కీం కూడా ఉందట. దాని పేరు రైల్ యాత్రీ భీమా యోజన. రూ12లక్షల కోట్ల పెట్టుబడులను 2024-29 కాలంలో ఐదేండ్ల పాటు పెడతారని సమాచారం. ఈ డబ్బుతో రైల్వేలను పూర్తిగా మార్చి..అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేస్తారని తెలుస్తోంది.

ఇక మనదేశంలో నిర్మించాలని ప్లాన్ చేస్తున్న మూడు ఎకనమిక్ కారిడార్లు మొత్తం 40వేల కిలోమీటర్లకు పైగా ఉండనున్నాయి. వీటికి రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి అవసరం ఉంటుందని అంచనా వేసింది. దేశంలోని 1300 రైల్వే స్టేషన్లను ప్రైవేట్ రంగంతో కలిసి.. ఆధునీకరిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్టేషన్లలో షాపింగ్ మాల్స్, ఎయిర్ పోర్ట్ తరహా లాంజ్‌లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ఆ జిల్లాల ప్రజలకు అలర్ట్..వడగళ్ల వాన పడే ఛాన్స్..బయటకు రావొద్దంటున్న ఐఎండి.!

#bjp #indian-railways #indian-railway #modi-sarkar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe