Central Election Commission : ఏపీలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటూ ఈసీ పర్యటన

ఏపీలో నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ రెండూ కూడా ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని కంప్లైంట్లు చేయడంతో ఆంధ్ర మీద ఫోకస్ పెట్టింది ఈసీ. ఇవాల్టి నుంచి మూడు రోజులపాటూ ఏపీలో పర్యటించనుంది.

New Update
Elections : జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు

CEC : కేంద్ర ఎన్నికల కమిషన్(Central Election Commission) ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మీద దృష్టి పెట్టింది. ఈరోజు నుంచి మూడు రోజుల పాటూ ఏపీలో పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajeev Kumar), ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే(Anoop Chandra Pande), అరుణ్ గోయల్(Arun Goel) విజయవాడ(Vijayawada)కు రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన చేస్తోంది. దానితో పాటూ ఓటర్ల జాబితాలో అవకతవకల విషయాన్ని కూడా పరిశీలించనుంది. ఈ రాత్రికి విజయవాడకు ఎన్నికల అధికారుల బృందం చేరుకుంటుంది.

Also Read:మోదీ ఎఫెక్ట్..ఆ ముగ్గురు మంత్రులూ సస్పెండ్

రేపు ఉదయం నుంచి ఏపీలో పని మొదలుపెట్టనుంది ఈసీ(EC). రేపు ఉదయం 10 గంటలకు రాజకీయ పార్టీలతో సమావేశం అవుతుంది. ఓటర్ల(Voters) జాబితాలో అవకతవకలు, పార్టీల ఫిర్యాదులపై రాష్ట్ర సీఈవోతో సమీక్ష చేయనుంది సీఈసీ.. అనంతరం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష సమావేశం నిర్వహించనుంది. దీని తర్వాత ఎల్లుండి అంటే 10వ తేదీన సీఈవో ఎన్నికల సన్నద్ధతపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు . ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్‌, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్ష జరపనుంది. ఎన్నికల కమిషన్...కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ సీఈసీ భేటీ కానుంది. చివరగా 10న సాయత్రం 4.30 గంటలకు సీఈసీ, కమిషనర్ల మీడియా సమావేశం నిర్వహించి..అదే రోజు ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానుంది కేంద్ర ఎన్నికల బృందం.

బదిలీలు, పోస్టింగ్‌లు...

మరోవైపు రెండు,మూడు నెలల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికలతో సంబంధమున్న అధికారులు సొంత జిల్లాలో ఉండకూడదని, దీర్ఘకాలంగా ఒకేచోట ఉన్నవారు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఆదేశాలు ఇచ్చింది. మూడేళ్లుగా ఒకే జిల్లాలో ఉన్న వారిని కొనసాగించవద్దని స్పష్టం చేసింది. 2024 జూన్ ఆఖరుకు మూడేళ్లు పూర్తయ్యేవారిని కొనసాగించొద్దని హెచ్చరించింది. బదిలీలు, పోస్టింగుల విషయంలో అలసత్వం వహించవద్దని హెచ్చరించింది. బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియను 2024 జనవరి నెలాఖరుకి పూర్తిచేసి, నివేదికను సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

అదనపు డీజీపీ నుంచి ఎస్సై వరకూ పోలీసుశాఖలో బదిలీలు చేపట్టనున్నారు. అదనపు డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఆర్‌ఐలకు ఈ బదిలీలు వర్తించనున్నాయి. ఎక్సైజ్‌ శాఖలో ఎస్సై, అంతకంటే పై స్థాయి అధికారులకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఉప ఎన్నికల అధికారులు, ఆర్‌వోలు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్‌కలెక్టర్లు, తహసీల్దార్లు అధికారులకు ఈ బదిలీల నిబంధన వర్తించనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు