సీఈసీ బృందంతో పొలిటికల్ లీడర్స్ భేటీ.. వారం పది రోజుల్లో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్!

తెలంగాణ ఎన్నికల నిర్వహణ అంశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ స్పీడ్ పెంచింది. ఇవాళ్టి నుంచి తెలంగాణలో మూడు రోజులు పర్యటించనున్న సీఈసీ బృందం.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలో భేటీ అయి.. అభ్యంతరాలను స్వీకరిస్తోంది. మంగళవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషన్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో రాజకీయ నాయకులతో భేటీ అయ్యింది. ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తమ అభ్యంతరాలపై ఎన్నిక సంఘానికి ఫిర్యాదులు చేశారు.

Telangana Elections: తెలంగాణ ఎన్నికలను హోరెత్తించిన జాతీయ నేతలు.. ఫలితం ఉండేనా?!
New Update

Telangana Election Notification: తెలంగాణ ఎన్నికల నిర్వహణ అంశంలో కేంద్ర ఎన్నికల కమిషన్(CEC) స్పీడ్ పెంచింది. ఇవాళ్టి నుంచి తెలంగాణ(Telangana)లో మూడు రోజులు పర్యటించనున్న సీఈసీ బృందం.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలో భేటీ అయి.. అభ్యంతరాలను స్వీకరిస్తోంది. మంగళవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషన్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో రాజకీయ నాయకులతో భేటీ అయ్యింది. ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తమ అభ్యంతరాలపై ఎన్నిక సంఘానికి ఫిర్యాదులు చేశారు.

అధికార బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే.. తమ ప్రధాన అభ్యంతరమైన పార్టీ సింబల్స్ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఇతర రాజకీయ పార్టీలకు, నాయకులకు కారు గుర్తును పోలి ఉండే గుర్తులను కేటాయించొద్దని వినతిపత్రం ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. ఈ సింబల్స్ కారణంగా గతంలో ఎంతో నష్టం జరిగిందని, ఆ వివరాలను ప్రస్తావిస్తూ సమస్యను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు బోగస్ ఓట్ల గురించి ప్రధానంగా లేవనెత్తారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు.. ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లను నమోదు చేయించారని ఆరోపించారు. ఈ బోగస్ ఓట్లను గుర్తించి తొలగించాలని ఈసీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు.

ఇదికూడా చదవండి: PM Modi vs CM KCR: కేసీఆర్ గురించి సంచలన విషయాలు రివీల్ చేసిన ప్రధాని మోదీ..

బీజేపీ సైతం బోగస్ ఓట్లపైనే ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓట్లను చెల్లా చెదురు చేశారని, భారీగా దొంగ ఓట్లను సృష్టించారని ఆరోపించారు బీజేపీ నేతలు. ఇందులో రాష్ట్ర అధికారుల ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. ఈ విషయంలో వెంటనే చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. నేతలతో భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. భద్రతా సిబ్బందితో సమావేశమైంది. ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు, కానుకల పంపిణీని నిలువరించేందుక ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది భ్రదతా దళాలు వివరించాయి.

ఇవాళ్టి మీటింగ్ ఇలా ఉంటే.. బుధవారం నాడు జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనన్లతో ఎన్నికల సంఘం అధికారులు భేటీ అవుతారు. ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు, రాష్ట్ర సరిహద్దు జిల్లాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు, పొలిటికల్ లీడర్స్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన వంటి అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక మూడవ రోజు, చివరి రోజైన గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో భేటీ అవుతుంది సీఈసీ బృందం. ఈ భేటీలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా తీసుకోవడంపై కీలక సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.

రానున్న వారం పది రోజుల్లో ఎన్నికల ప్రకటన..

తెలంగాణలో ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గడువు జనవరిలో ముగియనుండగా.. ఈలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అందుకే.. ఎన్నికల సంఘం అధికారులు వడి వడిగా కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల సంఘం మూడు రోజుల భేటీ తరువాత వారం, పది రోజుల్లోనే తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఇదికూడా చదవండి: PM Modi vs CM KCR: కేసీఆర్ గురించి సంచలన విషయాలు రివీల్ చేసిన ప్రధాని మోదీ..

#telangana-elections #elections-commission-of-india #telangana #telangana-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe