Cabinet Approves PM Surya Ghar Yojana: లోక్ సభ ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు సంక్షేమ పథకాలకు ఆమోదం తెలిపింది. పీఎం సూర్యఘర్ యోజన పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.75,021 కోట్లను కేటాయించింది. 2025 నాటికి కేంద్ర కార్యాలయాలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయనుంది. అలాగే ఈ పథకం కింద కోటి గృహాలు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది. మార్చి 13న ప్రధాని మోడీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
కేంద్రం అందించే సబ్సిడీ వివరాలు..
ఈ పథకాన్ని అందరు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది.
* 1kW సిస్టమ్స్ కోసం రూ. 30000,
* 2kW సిస్టమ్స్ కోసం రూ. 60000 వేలు,
* 3kW, అంతకంటే ఎక్కువ సిస్టమ్స్ ఏర్పాటు కోసం 78,000వేల సబ్సీడీలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
రూఫ్‌టాప్ సోలార్ పాలసీ సబ్సిడి పొందడం ఎలా..?
Step-1: https://pmsuryaghar.gov.in/ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
Step-2: వినియోగదారుడి నెంబర్, మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి
Step-3: అప్రూవల్ వచ్చిన తర్వాత డిస్కమ్ అనుమతి ఉన్న వెండర్ ద్వారా సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి
Step-4: సోలార్ ప్లాంట్ వివరాలు సమర్పించి మీటర్‌కు అప్లికేషన్ పెట్టుకోవాలి
Step-5: మీటర్ పెట్టిన తర్వాత డిస్కమ్ అధికారులు తనిఖీ చేసి సంబంధిత వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు
Step-6: డిస్కమ్ రిపోర్టు వెరిఫికేషన్ తర్వాత సబ్సిడీ నగదు వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది
Also Read: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ సర్కార్