PM Surya Ghar: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. కోటి గృహాలకు ఫ్రీ కరెంట్ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం సూర్యఘర్ యోజన పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.75,021 కోట్లను కేటాయించింది. 2025 నాటికి కేంద్ర కార్యాలయాలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయనుంది. ఈ పథకం ద్వారా కోటి గృహాలకు ఉచిత విద్యుత్ అందించనుంది. By V.J Reddy 29 Feb 2024 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Cabinet Approves PM Surya Ghar Yojana: లోక్ సభ ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు సంక్షేమ పథకాలకు ఆమోదం తెలిపింది. పీఎం సూర్యఘర్ యోజన పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.75,021 కోట్లను కేటాయించింది. 2025 నాటికి కేంద్ర కార్యాలయాలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయనుంది. అలాగే ఈ పథకం కింద కోటి గృహాలు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది. మార్చి 13న ప్రధాని మోడీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. Cabinet approves PM-Surya Ghar Muft Bijli Yojana for installing rooftop solar in One Crore households with a total outlay of Rs 75,021 crore. Prime Minister Narendra Modi had launched the scheme on 13th February, 2024 pic.twitter.com/1zN7U6bikb — ANI (@ANI) February 29, 2024 కేంద్రం అందించే సబ్సిడీ వివరాలు.. ఈ పథకాన్ని అందరు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. * 1kW సిస్టమ్స్ కోసం రూ. 30000, * 2kW సిస్టమ్స్ కోసం రూ. 60000 వేలు, * 3kW, అంతకంటే ఎక్కువ సిస్టమ్స్ ఏర్పాటు కోసం 78,000వేల సబ్సీడీలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రూఫ్‌టాప్ సోలార్ పాలసీ సబ్సిడి పొందడం ఎలా..? Step-1: https://pmsuryaghar.gov.in/ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి Step-2: వినియోగదారుడి నెంబర్, మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి Step-3: అప్రూవల్ వచ్చిన తర్వాత డిస్కమ్ అనుమతి ఉన్న వెండర్ ద్వారా సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి Step-4: సోలార్ ప్లాంట్ వివరాలు సమర్పించి మీటర్‌కు అప్లికేషన్ పెట్టుకోవాలి Step-5: మీటర్ పెట్టిన తర్వాత డిస్కమ్ అధికారులు తనిఖీ చేసి సంబంధిత వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు Step-6: డిస్కమ్ రిపోర్టు వెరిఫికేషన్ తర్వాత సబ్సిడీ నగదు వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది Also Read: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ సర్కార్ #pm-modi #cabinet-meeting #cabinet-meet #pm-surya-ghar-yojana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి