Bank Jobs : ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్.. 3,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్!

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం 3వేల పోస్టులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 6.

IBPS Clerk: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో 6128 ఉద్యోగాలు!
New Update

Latest Bank Jobs : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్‌(Central Bank Of India Recruitment) ను స్టార్ట్ చేసింది. 3,000 అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 06, 2024. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు www.nats.education.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.

అర్హతలు:
దరఖాస్తు చేసే అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ(Bachelor Degree) ని కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము:
PWBD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 400. SC/ST/మహిళా అభ్యర్థులు/EWS అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 600. మిగతా అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 800.

దరఖాస్తుదారులందరూ తప్పనిసరిగా www.nats.education.gov.in పోర్టల్‌ని విజిట్ చేయాలి. అక్కడ 'సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్‌షిప్' ఆన్‌లైన్ అప్లికేషన్‌ను సబ్మిట్‌ చేయాలి.

దరఖాస్తు చేయడానికి దశలు:

--> ముందుగా అధికారిక వెబ్‌సైట్ nats.education.gov.in ని విజిట్ చేయండి.

--> పోర్టల్‌లో నమోదు చేసుకోండి

--> అప్లికేషన్‌తో కొనసాగండి(Continue To Application).

--> 'సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్‌షిప్' అప్లికేషన్‌ ఫారమ్‌ కనిపిస్తుంది.

--> 'అప్లై' బటన్‌పై క్లిక్ చేసి లాగిన్ చేయండి.

--> ఫారమ్‌ను పూరించండి

--> డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయండి

--> రుసుము చెల్లించి సబ్మిట్ చేయండి.

--> కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి..ఫ్యూచర్‌ పర్పస్‌ కోసం ప్రింటవుట్ తీసుకోండి.

Also Read : ఏపీ టెట్‌ హాల్‌టికెట్స్ రిలీజ్.. డౌన్ లోడ్ లింక్ ఇదే!

WATCH:

#bank-jobs #latest-jobs #central-bank-of-india-recruitment
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe