Celery Juice: ఈ ఆకుతో కడుపులో మలినాలు మాయం..ముఖానికి మెరుపు కూడా ఖాయం సెలెరీ ఆకుకూరలో విటమిన్ కె , పొటాషియం, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్ల సమృద్ధిగా ఉంటాయి. వేసవిలోసెలెరీ ఆకూర జ్యూస్ తాగితే రీఫ్రెష్‌గా ఉంచటంతోపాటు కడుపు చల్లగా, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిని రోజూ తీసుకుంటే చర్మాన్ని మెరిసేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 24 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Celery Juice: ఆరోగ్యం కోసం మనం ఎన్నో రకాల ఆహార నియమాలను పాటిస్తూ ఉంటాం. అయితే వేసవిలో ప్రత్యేకంగా కొన్ని రకాల జ్యూస్‌లను తాగుతూ ఉంటాం. కానీ ఆకు కూరతో చేసిన ఓ రసం తాగితే వేసవి తాపం నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఆకుకూరల రసం తాగడం వల్ల కడుపు చల్లగా ఉండటమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని అంటున్నారు. అంతేకాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తుందని చెబుతున్నారు. అలాంటి ఆకుకూర రసం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. సెలెరీ జ్యూస్ ప్రయోజనాలు: ఆకు కూరల జ్యూస్ మనల్ని ఎప్పుడూ రీఫ్రెష్‌గా ఉంచుతుంది. అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్లు , మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఈ జ్యూస్ మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సెలెరీ జ్యూస్‌లో విటమిన్ కె , పొటాషియం, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్ల అధికంగా ఉంటాయి. ఫైటోన్యూట్రియెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. సెలెరీ రసం ఎలా తయారు చేయాలి? ఆకుపచ్చ, తాజా సెలెరీని తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆకుకూరలను బాగా కడిగిన తర్వాత కాండం, ఆకులను వేరు చేయాలి, గోధుమ రంగు, కుళ్లిన ఆకులను తీసేయాలి. ఆ తర్వాత జ్యూసర్లో వేసి రసం చేసుకోవాలి. ఆకుకూరల రసం నుంచి మంచి ఫలితాలు పొందాలంటే తాజాగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. దానిని రిఫ్రిజిరేటర్లో కొంత సమయం పాటు ఉంచవచ్చు. కాకపోతే మంచి ఫలితాలు ఉండాలంటే మాత్రం ఒకరోజు లోపే తాగాలని చెబుతున్నారు. ఈ రసంలో ఇతర పండ్లు లేదా కూరగాయలుకూడా కలుపుకోవచ్చని అంటున్నారు. అయితే మీకు ఏదైనా అలర్జీ సమస్యలు ఉంటే మాత్రం వైద్యుల సలహాతోనే ఈ రసాన్ని తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి : తిన్న తర్వాత స్వీట్లు తింటున్నారా?..వాటికి బదులు ఇవి తింటే గుండెకు చాలా మంచిది గమనిక : ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #best-health-tips #health-benefits #health-care #celery-juice మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి