/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/pawan-kalyan-game-changer.jpg)
Ap Politics : ఏపీలో మంగళవారం 2024 సార్వత్రిక ఎన్నికల (General Elections) కౌంటింగ్ మొదలు కావడంతో ఏపీలో ఎవరు గెలుస్తారా అనే దాని గురించి ఏపీ ప్రజలంతా కూడా ఉదయం నుంచే టీవీల ముందు సెటిల్ అయిపోయారు. ఈ క్రమంలోనే అసలు ఏపీలోనే మోస్ట్ అవైటెడ్ నియోజకవర్గమైన పిఠాపురం (Pithapuram) లో ఎవరూ గెలుస్తారు అనే మీద అందరూ ఎంతో ఉత్కంఠగా ఉన్నారు.
ఈ క్రమంలోనే పవన్ అనూహ్యంగా అత్యధిక మెజార్టీ సాధించి పిఠాపురం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన ప్రత్యర్థి వంగా గీత (Vanga Geetha) మీద ఘన విజయాన్ని సాధించారు. దీంతో పవన్ కల్యాణ్ కు సినీ ప్రముఖుల నుండి, అలాగే రాజకీయ ప్రముఖుల నుండి అభినందనల వెల్లువ మొదలైంది.ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాలీవుడ్ సెలెబ్రెటీస్ ట్వీట్స్ చేస్తున్నారు.
The Present & Future of Andhra Pradesh is now in safe hands.
POWER STORM @JanaSenaParty 💪🏼💪🏼💪🏼 pic.twitter.com/zM3QPlt7WZ
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 4, 2024
అయితే ఈ సారి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గెలువాలని టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది కూడా ఆయనకు సపోర్ట్ గా నిలిచారు.ఎన్నడూ లేని విధంగా పవన్ కు భారీగా ప్రజల మద్దతు లభించింది.సెలెబ్రెటీస్ అంతా కూడా పవన్ కు మద్దతు తెలపడం ,అలాగే ఆ నియోజకవర్గంలో పవన్ తరుపున ప్రచారం చేయడం పవన్ కు బాగా కలిసి వచ్చాయి.దీంతో పవన్ అఖండ విజయం సాధించారు .
Now we can proudly call him POWER STAR 🤩🔥 pic.twitter.com/G1416CzMQz
— Naga Vamsi (@vamsi84) June 4, 2024