Exam Tips : ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయారా? ఈ టిప్స్ పాటిస్తే మిగిలిన పరీక్షల్లో మీరే టాపర్! పరీక్షల్లో ఒక పేపర్ సరిగ్గా రాయకపోతే అధైర్యపడవద్దు. మిగిలిన పేపర్స్‌పై దీని ప్రభావం పడకుండా ఉండేలా చూసుకోండి. ఒక ఎగ్జామ్ సరిగ్గారాయనంత మాత్రానా తల్లిదండ్రులు పిల్లలను తిట్టకూడదు. మిగిలిన పేపర్స్‌ను టెన్షన్ లేకుండా రాసేలా మద్దతివ్వాలి. ఆరోగ్యాన్ని అసలు నెగ్లెక్ట్ చేయవద్దు. By Trinath 18 Feb 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి EXAM TIPS 2024 : CBSE బోర్డు పరీక్షల రౌండ్ ప్రారంభమైంది. విద్యార్థులు ప్రధాన సబ్జెక్టులను బాగా ప్రిపేర్ అవుతున్నారు. అయితే కొన్నిసార్లు పరీక్షల్లో ఆశించినంతగా రాయలేకపోతాం. ముఖ్యంగా మొదట జరగే పరీక్షలను రాస్తున్నప్పుడు కాస్త ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడితో చదివినవి కూడా గుర్తురావు. ఇలా మొదట్లో జరిగే ఒకటి, రెండు పేపర్లు సరిగ్గా రాయకపోతే విద్యార్థులు ఒత్తిడికి గురవడం చాలాసార్లు కనిపిస్తుంది. దీంతో చదువుల నుంచి వారి మనసు మళ్లుతుంది. ఇది వారి మిగిలిన పరీక్షలను కూడా ప్రభావితం చేస్తుంది. పరీక్ష సమయం(Exam Time) లో మీకు ఇలా జరిగితే మీరు ఈ టిప్స్ పాటించవచ్చు.. అప్పుడు మిగిలిన పరీక్షలు బాగా రాసే ఛాన్స్ ఉంటుంది. సంభాషణ: ప్రతి బిడ్డ జీవితంలో కచ్చితంగా ఎవరో ఒకరు క్లోజ్ ఉంటారు. మీరు ఒత్తిడి ఫీల్ అవుతున్న సమయాల్లో ఆ ప్రత్యేక వ్యక్తి నుంచి సహాయం తీసుకోండి. ఇంకోటి గుర్తుపెట్టకోవాలి. ఒక పేపర్ లేదా ఒక బోర్డ్ ఎగ్జామ్ జీవితానికి ముగింపు కాదని పిల్లలకు చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. చదువుతో పాటు తనను తాను నిరూపించుకునే అనేక రంగాలు ఉన్నాయి. సమస్యను అర్థం చేసుకోండి: లోపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ ఫోన్ లేదా సోషల్ మీడియా(Social Media) ద్వారా పరధ్యానంలో ఉన్నారా? స్నేహితుడి సలహా కారణంగా మీరు మీ చదువుపై దృష్టి పెట్టలేకపోయారా? మీ పనితీరును పాడుచేసింది ఏమిటో తెలుసుకోండి . ఆ తప్పును సరిదిద్దుకోండి. టెన్షన్ వద్దు: పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయాం.. మిగిలినవి కూడా రాయాలేమా లాంటి వాటి గురించి ఆలోచించి టెన్షన్ తీసుకోవద్దు. మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మరింత నష్టానికి గురిచేయవద్దు. తిట్టకూడదు: తల్లిదండ్రులు(Parents) తమ పిల్లలను తిట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోతే కొంతమంది తదుపరి పేపర్ కోసం ఒత్తిడి చేయడం ప్రారంభిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. దీని కారణంగా స్టూడెంట్‌పై ఒత్తిడి పెరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు పూర్తి మద్దతు ఇవ్వాలి. ధైర్యాన్ని కోల్పోవద్దు: ఒక సబ్జెక్టు పేపర్ బాగా రాయకపోతే నష్టమెమీ లేదు. మిగిలిన పరీక్షల్లోనూ బాగా రాణించవచ్చు. మిమ్మల్ని మీరు వైఫల్యంగా భావించే బదులు, కష్టపడి మిగిలిన పేపర్స్‌లో బాగా రాయడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. Also Read : ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? #exam-tips-2024 #cbse #students మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి