CBSE Conducts Surprise Inspections : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. నకీలీ స్కూళ్లను (Dummy Schools) నివారించడమే లక్ష్యంగా సీబీఎస్‌ఈ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఢిల్లీ (Delhi) తో పాటు రాజస్థాన్ (Rajasthan) లో మొత్తం 27 పాఠశాలల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు బోర్డు కార్యదర్శి హిమాన్షు గుప్తా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితమే డమ్మీ స్కూళ్లు, అర్హత లేని అభ్యర్థులతో నడుపుతున్న 20 పాఠశాలల గుర్తింపును సీబీఎస్‌ఈ రద్దు చేసింది.
Also Read: తెలంగాణలో వరద నష్టం రూ.5,438 కోట్లు.. శాఖల వారీగా లెక్కలివే!
ఈ నేపథ్యంలోనే మరోసారి సీబీఎస్‌ఈ తనిఖీల నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనుబంధ పాఠశాలలన్నీ తమ రూల్స్‌కు కట్టుబడి ఉన్నాయా ? లేదా ? అనేది పరిశీలించేందుకు బోర్టు ఈ తనిఖీలు చేపట్టింది. అయితే ఈ తనిఖీల్లో 27 టీమ్స్ పాల్గొన్నాయి. ఒక్కో టీమ్‌లో సీబీఎస్‌ఈ అధికారితో పాటు సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ ఉన్నారు. ఈ బృందాలు ఏకకాలంలో 27 స్కూళ్లపై తనిఖీలు చేపట్టాయి.
తాము ఎంపిక చేసిన ఈ పాఠశాలల్లో కచ్చితమైన ప్రణాళికతో ఈ తనిఖీలు చేపట్టామని సీబీఎస్‌ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా వెల్లడించారు. అలాగే ఈ తనిఖీల్లో గుర్తించిన అంశాలపై సమీక్ష చేస్తామని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తమ అనుబంధ పాఠశాలలన్నీ కూడా బోర్టు సూచించిన ప్రమాణాలు పాటించేలా చూసేందుకే ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Also Read: దీదీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లు ఆమోదం..