CBSE : ఇక పై ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్! ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టిది. అయితే మామూలుగానే పరీక్షలు నిర్వహిస్తామని సెమిస్టర్ విధానాన్ని అనుసరించమని అధికారులు స్పష్టం చేశారు. By Bhavana 27 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి CBSE Board Exams : ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్‌ఈ(CBSE) బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టిది. అయితే మామూలుగానే పరీక్షలు నిర్వహిస్తామని సెమిస్టర్ విధానాన్ని అనుసరించమని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయం గురించి పాఠశాలల ప్రిన్సిపాళ్లతో వచ్చే నెలలో చర్చలు కూడా జరిపేందుకు విద్యాశాఖ రెడీ అవుతోంది. అండర్ గ్రాడ్యూయేట్ కోర్సుల్లో(UGC) అడ్మిషన్ల పై ఎటువంటి ప్రభావం లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఆలోచిస్తుంది. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా సీబీఎస్‌ఈ పరీక్షల్లో మార్పులు చేయాలని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదా కమిటీ గతంలో సూచించింది. ఇస్రో(ISRO) మాజీ చైర్మన్ కె. కస్తూరీ రంగన్(K Kasturi Rangan) సారథ్యంలోని ఈ కమిటీ 11, 12వ తరగతి విద్యార్థులకు సెమిస్టర్ విధానాన్ని వర్తించాలని ప్రతిపాదించింది. ఈ విషయం గురించి గత అక్టోబర్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీబీఎస్‌ఈ విద్యార్థులు రెండు సార్లు పరీక్షకు హాజరుకావడం తప్పనిసరేమీ కాదని అన్నారు. ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే స్టూడెంట్స్ ఏడాదికి రెండు సార్లు పది, పన్నెండవ తరగతుల పరీక్షలు రాసే అవకాశం ఉంటుందన్నారు. Also read: మరికాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల! #isro #education #cbse #board-exams మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి