ఇకపై ఏడాదికి రెండు సార్లు CBSE బోర్డ్ ఎగ్జామ్!

10-12వ తరగతి విద్యార్థులకు సంవత్సరానికి రెండుసార్లు సీబీఎస్ ఈ బోర్డు ఎగ్జామ్ నిర్వహించే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ కొత్త నమూనా మొదటి పరీక్ష జనవరి 2026లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఆసక్తి లేనివారు ఏదైనా ఒక పరీక్షకు హాజరు కావచ్చని తెలిపింది.

ఇకపై ఏడాదికి రెండు సార్లు CBSE బోర్డ్ ఎగ్జామ్!
New Update

CBSE Board Exam: 10-12వ తరగతి విద్యార్థులకు సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ కొత్త నమూనా మొదటి పరీక్ష జనవరి 2026లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే రెండవ పరీక్ష కూడా అదే సెషన్‌లో ఏప్రిల్ 2026లోనే నిర్వహించబడుతుందని తెలిపింది.

అయితే విద్యార్థులందరికీ రెండు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఇవ్వబడుతుందని పేర్కొంది. తమ సౌలభ్యం ప్రకారం రెండు పరీక్షలకు హాజరు కావచ్చు. లేదా ఏదైనా ఒక పరీక్షకు హాజరు కావచ్చు. రెండు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ మెరుగైన పనితీరు ఫలితాలను ఉపయోగించుకోగలుగుతారని తెలిపింది. ఈ ప్రక్రియ కోసం విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యా విభాగం దేశవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆన్‌లైన్, ఆఫ్ లైన్ సమావేశాల ద్వారా సంప్రదించి తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

మొదటి ఎంపిక:

ఉన్నత విద్య సెమిస్టర్ విధానంలాగే ప్రతి సెమిస్టర్ చివరిలో సెప్టెంబర్, మార్చిలో సగం సిలబస్ పరీక్షలు నిర్వహిస్తారు.

రెండవ ఎంపిక:

మార్చి-ఏప్రిల్‌లో బోర్డు పరీక్షల తర్వాత సప్లిమెంటరీ పరీక్షకు బదులుగా పూర్తి బోర్డు పరీక్షలను జూలైలో నిర్వహిస్తారు.

మూడవ ఎంపిక:

జనవరి, ఏప్రిల్‌లో JEE మెయిన్స్‌కు రెండు పరీక్షలు ఉన్నట్లే.. మొత్తం సిలబస్‌కు బోర్డు పరీక్షలు కూడా జనవరి, ఏప్రిల్‌లలో నిర్వహిస్తారు.

చాలా మంది ప్రధానోపాధ్యాయులు మూడవ ఎంపికకు అనుకూలంగా తమ మద్దతును తెలిపారు. సెమిస్టర్ విధానం చాలా మంది ప్రధానోపాధ్యాయులచే తిరస్కరించబడింది. అయితే జూలైలో రెండవ పరీక్ష ఎంపిక తిరస్కరించబడింది. ఎందుకంటే ఇది విద్యార్థులకు ఒక సంవత్సరం ఆదా చేయడం లేదా ఉన్నత విద్యలో ప్రవేశం పొందడంలో సహాయపడదు. ప్రధానోపాధ్యాయులు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరాం.

2025-26లో పాత సిలబస్‌లోనే పరీక్షలు జరుగుతాయి:

కొత్త సిలబస్ ఆధారంగా 10, 12 తరగతుల పుస్తకాలు రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఈ పుస్తకాలు 2026-27 సెషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి 2025-26 బోర్డు పరీక్షలు పాత సిలబస్, పుస్తకాల ఆధారంగానే నిర్వహించబడతాయి. కొత్త నమూనాతో సౌకర్యవంతంగా ఉండటానికి విద్యార్థులకు తగినంత సమయం లభిస్తుందని భావిస్తున్నట్లు కేంద్రం వివరించింది.

Also Read: టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ నలుగురు.. ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఉందంటే?

#cbse-board-exam #cbse
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe