Kolkata: ఉన్నావ్, హత్రాస్ కేసుల దర్యాప్తు అధికారుల చేతికి ట్రైనీ డాక్టర్ హత్య కేసు

కోలకత్తా డాక్టర్ హత్య కేసు దేశంలో ఎంత సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో ఇప్పుడు మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఉన్నావ్, హత్రాస్ అత్యాచార ఘటనల్ని దర్యాప్తు చేసిన ఇద్దరు సీనియర్ సీబీఐ అధికారులకు కోల్‌కతా డాక్టర్ కేసును అప్పగించారు.

Kolkata: ఉన్నావ్, హత్రాస్ కేసుల దర్యాప్తు అధికారుల చేతికి ట్రైనీ డాక్టర్ హత్య కేసు
New Update

Trainee Doctor Murder Case: నిర్భయ రేప్ కేసు తర్వాత దేశాన్ని కుదిపేసిన హత్య కోలకత్తాలోని ట్రైనీ డాక్టర్ ది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అయిన ఆర్జీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో నైట్ డ్యూటీ చేస్తున్న 31 ఏళ్ళ వైద్యురాలిని చంపేయడమే కాక ఆ తరువాత రేప్ కూడా చేశారు. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే డాక్టర్‌‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విషయంలో దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లు, సాధారణ ప్రజలు అందరూ ఆందోళన చేస్తున్నారు. ఈ కేసు విషయంలో ఇప్పటికే చాలా దారుణాలు జరిగాయి. పోలీసులు నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనబడింది. దానికి తోడు సాక్ష్యాలను నాశనం చేయడానికి కొందరు ప్రయత్నించారు. దీంతో ఈ కేసు సీబీఐకి అప్పగించింది కోలకత్తా కోర్టు.

ఇప్పుడు ఇందులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ డాక్టర్ హత్య కేసును ఇద్దరు సీనియర్ అధికారులకు అప్పగించారు. ఉన్నావ్, హత్రాస్ అత్యాచార ఘటనల్ని దర్యాప్తు చేసిన ఇద్దరు సీనియర్ సీబీఐ అధికారులకు కోల్‌కతా డాక్టర్ కేసును అప్పగించారు. ఈ రెండు సంచలనాత్మక కేసుల్లో దర్యాప్తు చేసి విజయం సాధించారు ఈ ఇద్దరు ఆఫీసర్స్. జార్ఖండ్‌కు చెందిన 1994 బ్యాచ్ IPS అధికారి అయిన సంపత్ మీనా, మరో సీనియర్ అధికారి సీమా పహుజా కూడా కోల్‌కతా కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ప్రస్తుతం మీనా అదనపు డైరెక్టర్‌గా బాధ్యత వహిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో 10వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో మరో అధికారిణి పహుజా గ్రౌండ్ లెవల్‌లో విచారణ జరిపి తీర్పు వచ్చేలా చేశారు. 2017లో గుడియా కేసు హిమాచల్ ప్రదేశ్‌ని కుదిపేసింది. 2017లో ఉన్నావ్ రేప్ కేసులో 17 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం కేసులో బీజేపీ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కి జీవిత ఖైదు విధించారు.

మా అన్నను ఉరి తీయండి..

మరోవైపు డాక్టర్‌‌ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌ను ఉరి తీయాలని అతని సోదరి డిమాండ్ చేశారు. అతనికి నాలుగు పెళ్ళిళ్ళ అయిన విషయం తనకి తెలియదని...మీడియా ద్వారానే తెలుసుకున్నానని చెప్పారు. ఈ హత్య వెనుక చాలా కోణాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇప్పటికే నిందితుడిని మూడు రోజులుగా విచారిస్తున్నారు. దానితోడు కోలకత్తా హైకోర్ట్ అతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించడానికి అనుమతినిచ్చింది.

Also Read: Rajiv Gandhi: సమాచార విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ..

#cbi #kolkata #kolkata-trainee-doctor-case #unnav #hatras
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe