Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు ఊహించని ట్విస్ట్

ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చే వారంలో తీహార్ జైలులో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనుంది.

New Update
Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు ఊహించని ట్విస్ట్

CBI To Investigate MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ ఇచ్చింది సీబీఐ. మద్యం స్కాం కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. అయితే... సీబీఐ వేసిన పిటిషన్ ను అంగీకరించిన కోర్టు.. కవితను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. వచ్చే వారంలో తీహార్ జైలులో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనుంది. కవిత ఇచ్చే వాంగ్మూలాన్నిసీబీఐ నమోదు చేసుకోనుంది. జైలులోకి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. విచారణకు ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐ కి  కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ALSO READ: ఏపీలో బీజేపీకి షాక్

41ఏ కింద నోటీసులు..

ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలిగా ఛార్జిషీట్ లో సీబీఐ (CBI) చేర్చింది. ఈ మేరకు నిందితురాలిగా పేర్కొంటూ 41A కింద సమన్లు పంపింది. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 26న ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు రావాలని సీబీఐ కవితకు నోటీసులు (Notices) పంపిన విషయం తెలిసిందే. 2022లో ఎమ్మెల్సీ కవిత ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ లోని ఆమె నివాసంలో  సీబీఐ విచారణ చేపట్టింది.

కవితకు బెయిల్ వస్తుందా?

లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలు(Tihar Jail) లో ఉన్న ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని అందుకుగాను తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) లో పిటిషన్ దాఖలు చేసింది. కాగా కవిత వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తీర్పును సోమవారం వెల్లడిస్తామని చెప్పింది. ఏప్రిల్ 20వ తేదిన ఉదయం 10.30 గంటలకు కోర్టు తన తీర్పును వెలువరించనుంది. కాగా.. కవితను గురువారం బెయిల్ వస్తుందని ఆశించించిన బీఆర్ఎస్ శ్రేణులకు, కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. మరి కవితకు కోర్టు బెయిల్ ఇస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. 

Advertisment
తాజా కథనాలు