UGC-NET: యూజీసీ నెట్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు..నీట్‌పై సుప్రీం విచారణ

యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. డార్క్ వెబ్‌లో పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరోవైపు నీట్ వ్యవహారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

New Update
UGC-NET: యూజీసీ నెట్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు..నీట్‌పై సుప్రీం విచారణ

UGC-NET, NEET Exams: నీట్, నెట్ పేపర్లు లీక్ చర్చీయాంశంగా మారింది. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద నీలి నీడలు క్ముకుంటున్నాయి. ఎన్‌టీఏ నిర్మాణం, పనితీరు, పారదర్శకతను పరిశీలించేందుకు హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డార్క్ వెబ్‌లో పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడం ఆందోళనకరమని అన్నారు. దేశ వ్యాప్తంగా దీని మీద నిరనలుకూడా వెల్లువెత్తాయి. విద్యార్ధి సంఘలు ఆందోళనలు నిర్వహించాయి. దీంతో ఈ వ్యవహరం మీద సీబీఐ విచారణ ప్రారభించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

నీట్ విచారణపై సుప్రీంకోర్టు స్టే..

మరోవైపు నీట్ పరీక్షా ఫలితాల అవకతవకల మీద కూడా దుమారం చెలరేగుతోంది. దీని మీద పలు రాష్ట్రాల్లో హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు అయ్యాయి. మరవపు సుప్రీంకోర్టులో కూడా నీట్ వ్యవహారం మీద పిటిషన్ దాఖలు అయింది. దీంతో హైకోర్టుల్లో జరుగుతున్న విచారణలన్నింటి మీదా ఉన్నత న్యాయసథానం స్టే విధించింది. అన్ని పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలని ఎన్టీయే కోరడంతో ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటూ నీట్‌ యూజీ 2024 పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది. అయితే నీట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఆపేది లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

ఇక మరోవైపు తమకు పరీక్ష ముందు రోజే ప్రశ్నాపత్రం అందింది అంటూ పలువురు విద్యార్ధులు ఒప్పుకున్నారు. బీహార్‌లో ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని సమాచారం వచ్చింది. అయితే ఎన్టీయే మాత్రం దీన్ని తోసి పుచ్చింది. కానీ బీహార్ ప్రభుత్వం నీట్ మీద ఏర్పాటు చేసిన సిట్ అధికారులు ఈ వ్యవహారంలో ఇప్పటికే 14 మంది విద్యార్ధులను అరెస్ట్ చేశారు. వీరిలో బిహార్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్‌ ఇంజినీర్‌తో పాటు ముగ్గురు నీట్‌ అభ్యర్థులు కూడా ఉన్నారు. వీరిలో ఓ అభ్యర్థి జూనియర్‌ ఇంజినీర్‌కు స్వయానా మేనల్లుడు కావడం గమనార్హం.

Also Read:భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం- బండి సంజయ్

Advertisment
Advertisment
తాజా కథనాలు