కాసేపట్లో ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత

కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. సీబీఐ కవితను వారం రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది.నిన్న తీహార్‌ జైల్లో కవితను సీబీఐ అరెస్ట్‌ చేసింది.లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌తో కలిసి కుట్ర చేసినట్టు కవితపై సీబీఐ ఆరోపణలు చేస్తోంది.

New Update
MLC Kavitha: కవిత బెయిల్‌ పై తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు

BRS Mlc Kavitha: కవిత చుట్టూ నెమ్మదిగా ఉచ్చు బిగుసుకుంటోంది. ఈడీ ఆరోపణలతో ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్న ఆమెను నిన్న సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. ఇవాళ కవితను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది. వారం రోజుల పాటూ విచారించేందుకు సీబీఐ కోర్టును కోరనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌తో కలిసి కవిత స్కామ్ చేశారని సీబీఐ చెబుతోంది. 100కోట్ల ముడుపుల చెల్లింపులో కవిత కీలకపాత్ర పోషించారని అభియోగాలు మోపింది. ఇటీవల జరిపిన విచారణలో సహకరించకపోవడం వల్లనే కవితను అరెస్ట్‌ చేశామని చెబుతోంది.ముఖ్యంగా బుచ్చిబాబు ఫోన్‌ నుంచి రికవరీ చేసిన వాట్సాప్‌ చాట్‌పై సీబీఐ దృష్టి పెట్టింది. దాని ఆధారంగానే కవితను అరెస్ట్ చేశామని అంటోంది.

మరోవైపు కవిత అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ ఆమె తరపు లాయర్‌ ట్రయల్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్‌ చేయడం సరికాదని లాయర్ అంటున్నారు. ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని ఇప్పటికే స్పెషల్ జడ్జి వ్యాఖ్యానించారు. దీనిపై కూడా కాసేపట్లో సీబీఐ స్పెషల్ కోర్టులో విచారణ చేయనుంది.

మార్చి 15న కవితను అరెస్ట్‌ చేసిన ఈడీ..కొన్నిరోజులు కస్టడీలో ఉంచింది. దాని తర్వాత ఈ నెల 23వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్ట్. ఇక ఈ నెల 16న కవిత రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది. లిక్కర్‌స్కామ్‌ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితను..నిన్న సీబీఐ అరెస్ట్ చేసింది.దీంతో ఇప్పుడు ఈడీ కేసులో బెయిల్ వచ్చినా.. CBI కేసులో జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి కవితది. ఈ కేసులో కవితను ఇప్పటికే రెండుసార్లు విచారించింది. గత ఏడాది డిసెంబర్ 11న హైదరాబాద్ లోని ఆమె నివాసంలో..దాదాపు 7గంటలకు పైగా విచారించింది. ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన అధికారులు.. ఆ తర్వాత కవితను నిందితురాలిగా చేర్చుతూ ట్రయల్ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఇక తీహార్ జైల్లో ఉన్న కవితను ట్రయల్ కోర్టు అనుమతితో..మరోసారి ఈ నెల 6న రెండోసారి దాదాపు 3గంటల పాటు సీబీఐ విచారించింది.

Also Read:IPL-2024:స్కై అంటే అంతే మరి..అట్లుంటుంది మనోనితోని..

Advertisment
Advertisment
తాజా కథనాలు