CBI Notice to DK ShivaKumar: దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు పెద్దన్న పాత్ర పోషిస్తోన్న కర్ణాటక(Karnataka) డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ(CBI) నోటీసులు ఇవ్వడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి డీకే శివకుమార్ మలయాళ టెలివిజన్ ఛానెల్‌లో పెట్టుబడులు పెట్టడంపై వివరాలను కోరుతూ సీబీఐ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. శివకుమార్ భాగస్వామిగా ఉన్న కేరళకు చెందిన జైహింద్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సీబీఐ వివరాలు కోరింది. అవసరమైన అన్ని పత్రాలతో విచారణ అధికారి ముందు హాజరు కావాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు సమన్లు పంపించారు.
ఇదంతా కుట్రలో భాగమే:
సీబీఐ నోటీసులపై డీకే శివకుమార్ (DK ShivaKumar) రియాక్ట్ అయ్యారు. తనను రాజకీయంగా అంతం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని డీకే శివకుమార్ ఆరోపించారు. కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకున్న తర్వాత కూడా సీబీఐ నోటీసులిచ్చిందన్నారు. తనను హింసించి రాజకీయంగా అంతం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని.. దీని వెనుక పెద్ద మనుషులున్నారని, పెద్ద కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు. తానేమీ తప్పు చేయలేదని... కాబట్టి దేనికీ భయపడనని చెప్పుకొచ్చారు డీకే. ప్రభుత్వం ఇప్పటికే లోకాయుక్తకు ఇచ్చిందరి.. తదుపరి ప్రక్రియను లోకాయుక్త చూసుకుంటుందన్నారు.
నేను జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా:
నోటీసును సవాల్ చేస్తారా అని శివకుమార్‌ను రిపోర్టర్లు ప్రశ్నించగా.. సీబీఐ సమన్లు పంపిస్తోందని, అయితే అక్కడికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. 'నన్ను కటకటాల వెనుక చూడాలనుకుంటే, అలా చేయనివ్వండి. నేనేమీ అనుకోను. దీనికి నేను సిద్ధంగా ఉన్నాను.' అని తెలిపారు. వారి ఉద్దేశాలు ఏమిటో తనకు తెలియడం లేదని, అయితే కేంద్రం తనను, తన పార్టీని వేధించాలని చూస్తోందని స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
Also Read: జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..పూర్తివివరాలివే..!!
WATCH: