World Cup 2023: వీళ్ళు లేకపోతే అసలు మ్యాచ్ గెలిచేవాళ్ళమే కాదు.. నిన్న జరిగిన ఇండియా-న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ లో విరాట్, అయ్యర్, షమీలు హీరోలని అందరూ పొగుడుతున్నారు. కానీ ఇండియా ఫైనల్స్ కు చేరడానికి మరో ఇద్దరు హీరోలే కారణం. వీళ్ళు లేకపోతే మ్యాచ్ గెలవడం కష్టమే అయి ఉండేది. వాళ్ళే కే ఎల్ రాహుల్, జడేజా. By Manogna alamuru 16 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి క్యాచస్ విన్ మ్యాచస్...నిన్నటి మ్యాచ్ చూసిన ఎవరికైనా ఇది తార మంత్రం అన్న విషయం బోధపడుతుంది. బ్యాటర్లు బ్యాటింగ్ చేయడం...బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడం ఇవన్నీ చాలా ముఖ్యం. కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం మరొకటి ఉంటుంది క్రికెట్ లో. అదే ఫీల్డింగ్. ఇదే కనుక సరిగ్గా లేకపోతే ఎవరు ఎంత గొప్పగా బ్యాట్ చేసినా..బౌలింగ్ చేసినా ఫలితం సున్నా. నఇన్నటి సెమీస్ లో ఇండియా గెలిచి ఫైనల్ కు చేరుకోవడానికి అతి ముఖ్యమైన కారణం ఇద్దరు ఫీల్డర్లు. వీళ్ళు ఇద్దరు కూడా వన్ ఆఫ్ హీరోస్. అందులో ఒకరు వికెట్ కీపర్ కె ఎల్ రాహుల్ అయితే...రెండో అతను రవీంద్ర జడేజా. వీళ్ళిద్దరే కనుక మైదానంలో పాదరసంలా కదలకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం మరొకలా ఉండేది. View this post on Instagram A post shared by ICC (@icc) Also Read:ఆ పిచ్‌పై 7 వికెట్లు తీశావంటే నువ్వు నిజంగా దేవుడివే భయ్యా.. షమీ గురించి ఏం చెప్పినా తక్కువే! బౌలర్లు తీసిన పది వికెట్లలో 7 క్యాచ్ ల ద్వారా వచ్చినవే. అవి రాహుల్, జడేజాలు పట్టినవే. ఒకే ఒక్కటి రోహిత్ క్యాచ్ చేశాడు. జడేజా, రాహుల్ ల మెరుపు వేగంతో ఒక్క క్యాచ్ ను కూడా మిస్ చేయలేదు. జడేజా అయితే బంతి గాల్లోకి లేవడమే ఆలస్యం అన్నట్లు మైదానం నలుమూలలా తిరిగి క్యాచ్‌లు అందున్నాడు. ఇక రాహుల్ అయితే వికెట్ల వెనుక అటు ఇటూ దూకుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ లను అందుకున్నాడు. అయితే బ్యాటర్లకు, బౌలర్లకు దక్కిన ప్రశంసలు ఫీల్డర్లకు దక్కలేదు. కానీ ఫీల్డర్లకు ఎంత గుర్తింపునిస్తే అన్ని అద్భుతాలు చేస్తారు. నిన్నటి మ్యాచ్‌లో ఫీల్డర్ల పాత్ర వెలకట్టలేనిది. షమీ డ్రాప్ క్యాచ్ (విలియమ్సన్) మినహాయించి, మ్యాచ్ మొత్తం టీమిండియా ఫీల్డర్లు మైదానంలో చిరుతల్లా కదిలారు. View this post on Instagram A post shared by ICC (@icc) సెమీస్ మ్యాచ్ అంటే ఇలాగే ఉండాలి అన్న రీతిలో జరిగిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్లో...భారత్ 70 పరుగులు తేడాతో విజయాన్ని సాధించి ఫైనల్ కు చేరుకుంది. Also Read:మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో ముగిసిన ప్రచారం, రేపు పోలింగ్ #india #icc-world-cup-2023 #semis #catches మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి