Japan : ఒక పిల్లి(Cat).. ఒక నగరాన్నే వణికిస్తోంది. తప్పిపోయిన ఆ పిల్లిని వెతికేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పిల్లి నగరంలో హై అలర్ట్(High Alert) కూడా విధించారు. జపాన్(Japan) లో జరుగుతున్న ఈ వింత ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. జపాన్లోని ఫుకియామా నగరంలో ఓ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంకులో అనుకోకుండా పడిపోయింది. అయితే అందులో నుంచి అది సురక్షితంగా బయటకు వచ్చేసింది. అక్కడి నుంచి వెంటనే పారిపోయింది కూడా. ఇప్పుడు ఈ విషయమే ఫుకియామా(Fukuyama) ప్రజలను, అధికారులను తీవ్రంగా భయపెడుతోంది. ఎందుకంటే పిల్లి పడిన ట్యాంకులోని రసాయనాలు చాలా డేంజరస్ అంట. వీటిని ఒంటి నిండా అంటించుకున్న పిల్లి వల్ల ఆ రసాయనాలు నగరమంతా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇవి ఎంత అపాయకరమంటే… వాటిని తాకితేనే చనిపోయే ప్రమాదం ఉంది. వీటి వల్ల క్యాన్సర్ కూడా వస్తుంది.
పూర్తిగా చదవండి..International : జపాన్లో ఒక సిటీనీ వణికిస్తున్న పిల్లి.. హై అలర్ట్
జపాన్లో ఒక నగరం మొత్తాన్ని ఓ చిన్న పిల్లి వణికిస్తోంది. అక్కడి ఫుకియామా నగరంలో అధికారులకు, పరజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని వారు ప్రతీరోజూ భయంతో గడుపుతున్నారు. ఇదేంటో విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా...అయితే కింది వార్త చదివేయండి.
Translate this News: