/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/mppeddireddymithunreddy-1721288288.jpg)
MP Mithun Reddy: పుంగనూరులో నిన్న జరిగిన టీడీపీ, వైసీపీ పరస్పర దాడుల్లో కేసులు నమోదు చేశారు పోలీసులు. మాజీ ఎంపీ రెడ్డప్ప (Reddeppa) ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందితో సహా మరికొందరి టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మరోవైపు టీడీపీ నాయకుడు సుహేల్ భాష (Suhail Basha) ఫిర్యాదు మేరకు హత్యయత్నంతో సహా పలు సెక్షన్ల కింద A1గా ఎంపీ మిథున్ రెడ్డి, A2గా మాజీ ఎంపీ రెడ్డప్పతో సహా 34 మంది పై కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకుడు ఆర్.కె.ప్రసాద్ ఫిర్యాదు మేరకు వైసీపీ నాయకులు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పతో సహా 33 మంది పై సెక్షన్ 307 తో పాటు పలు సెక్షన్ కింద కేసు నమోదైంది.