/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/MLC-BHARAT.jpg)
MLC Bharath: కుప్పం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ భారత్ కు షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. తిరుమలలో తోమాల సేవ పేరిట సిఫారసు లేఖ విక్రయించినట్లు గుంటూరులోని అరండల్‌పేట పోలీసులకు టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. గుంటూరు వాసుల నుంచి రూ.3లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ భరత్‌తో పాటు ఆయన పీఆర్వో మల్లికార్జునపైనా కేసు చేశారు పోలీసులు. శాసనసభ ఎన్నికల్లో కుప్పం నుంచి సీఎం చంద్రబాబుపై భరత్ పోటీ చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే.