Palla Rajeshwar : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు

BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశారని..నకిలీ పత్రాలు సృష్టించారని.. ఇదేంటి అని అడిగితే బెదిరించారని రాధిక అనే మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనతో పాటు భార్య నీలిమపై కేసు నమోదు చేశారు.

New Update
Palla Rajeshwar : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు

Palla Rajeshwar Reddy : మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరగనున్న వేళ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కి షాక్ తగిలింది. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్నారని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్(Congress), బీజేపీ పార్టీ(BJP Party) లకు మరో అస్త్రం దొరికినట్లయింది. జనగాం(Janagaon) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy) పై రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పీఎస్‌లో ఎఫ్ఐఆర్ (నెం.50/2024, తేదీ 23.01.2024) నమోదైంది. నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించే ప్రయత్నం చేశారని, ప్రశ్నించినందుకు బెదిరించారని ఫిర్యాదు రావడంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు ఆయన భార్య నీలిమ, మరో వ్యక్తి మధుకర్‌రెడ్డిపై ఐపీసీలోని 427, 447, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Also Read : Harish Rao: బీసీ జన గణన చేపట్టాలి.. హరీష్ రావు డిమాండ్

అసలేమైంది..

ఘట్‌కేసర్ సమీపంలోని చౌదరిగూడ గ్రామంలో సర్వే నెం. 796లోని 150 చ.గజాల విస్తీర్ణం ఉన్న ప్లాట్ (నెం. 18)ను అక్రమంగా స్వాధీనం చేసుకోడానికి జనగాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రయత్నం చేశారని, దీనిపై వివరణ అడిగినందుకు తనను బెదిరిస్తున్నారని ఉప్పల్ సమీపంలోని బుద్ధనగర్‌కు చెందిన ముచ్చెర్ల రాధిక అనే మహిళా ఈ నెల 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

1984, 1985 సంవత్సరాల్లో చౌదరిగూడ గ్రామంలోని సర్వే నెం.796 నెంబర్ గల స్థలం యజమాని ఎంఏ రషీద్ (రామాతపూర్‌లో నివాసం) 167 ప్లాట్లు చేసి విక్రయించారని, అందులో 150 చ. గజాల విస్తీర్ణం ఉన్న ఒక ప్లాట్‌ను తాను 2010లో ఊటుకూరు మల్లేశం (గుండెల మండలం) నుంచి కొనుగోలు చేసినట్టు (డాక్యుమెంట్ నెం. 1862/2010) రాధిక ఫిర్యాదులో పేర్కొన్నారు.

అప్పటి నుంచీ తన పేరు మీదనే రిజిస్టర్ అయిన ఆ స్థలం తన ఆధీనంలోనే ఉండేదని.. రక్షణ కోసం చుట్టూ కొన్ని స్థంభాలు పాతి ప్రహరీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టుకు చెందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆయన భార్య నీలిమ, మరొకరు మధుకర్ రెడ్డి ఎలాంటి అనుమతి లేకుండా ప్లాట్‌లోకి చొరబడి స్థలం చుట్టూ ఏర్పాటు చేసిన సరిహద్దు స్థంభాలను తొలగించారని, తనతో పాటు తన భర్త సిద్దేశ్వర్ ఈ విషయాన్ని ప్రశ్నించామని, అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని రాధిక ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read : ఇప్పుడు కుల గణన ఎందుకు?.. సీఎం జగన్‌కు పవన్ బహిరంగ లేఖ

DO WATCH: 

Advertisment
తాజా కథనాలు