Pawan Kalyan : పవన్ కు హరిరామజోగయ్య మరో లేఖ! కాపు నేత హరిరామజోగయ్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి లేఖను రాశారు. ఆ లేఖలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళ్లలో పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కూడా కోరారు.అలాగే కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కూడా సూచించారు. By Bhavana 05 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Dwarampudi Chandrasekhar Reddy : ఏపీ (Andhra Pradesh) లో ఎన్నికల సమయంలో పవన్ మీద లేఖాస్త్రాల దాడులు జరిగిన విషయం తెలిసిందే. అందులో ఎక్కువ లేఖలు రాసిన వారు హరిరామజోగయ్య (Harirama Jagaiah). ఆయన ఇప్పటికీ పవన్ కి లేఖలు రాస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు టీడీపీ (TDP) కి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మద్దతుని ఆయన సమర్థించలేదు. రాబోయే అధికారంలో వాటా అడగాలన్నారు, జనసేన 21 సీట్లకు పరిమితం కావడమేంటని ప్రశ్నలు సంధించారు. ఫలితాల తర్వాత మాత్రం హరిరామజోగయ్య పూర్తిగా తన పంథాను మార్చారు. పవన్ వ్యూహాన్ని మెచ్చుకుంటూనే ఆయనకు మరిన్ని ఉచిత సలహాలిచ్చారు. హరిరామజోగయ్య ముందుగా తన లేఖలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) కి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. వారిద్దరి హయాంలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళ్లలో పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కూడా కోరారు. అలాగే కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కూడా హరిరామ జోగయ్య పవన్ కల్యాణ్ ని కోరడం మరో విశేషం. మండల పరిషత్, పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు.సినిమాల విషయంలో కూడా పవన్ కల్యాణ్ కి కీలక సలహా ఇచ్చారు హరిరామజోగయ్య. సినిమాలు మానేయకుండా రాజకీయాల్లో కొనసాగాలన్నారు. Also read: విద్యుత్ బిల్లుల చెల్లింపులో క్యూ ఆర్ కోడ్ విధానం! #pawan-kalyan #andhra-pradesh #politics #harirama-jogaiah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి