Malla Reddy: మల్లారెడ్డి పై కేసు నమోదు..!

మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు అయ్యింది. శామీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ లో మల్లారెడ్డి పై పోలీసులు ఎస్సీ , ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి తో పాటు అతని అనుచరులు 9 మంది పై 420 చీటింగ్‌ కేసు కూడా నమోదు అయ్యింది.

New Update
MLA Mallareddy: మాజీమంత్రి మల్లారెడ్డిపై కేసు

Telangana Politics: తెలంగాణ మాజీ మల్లారెడ్డి (Mallareddy)పై కేసు నమోదు అయ్యింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ప్రజావాణిలో ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ లో మల్లారెడ్డి పై పోలీసులు ఎస్సీ , ఎస్టీ, అట్రాసిటీ కేసు (SC,ST, Atracity Case) నమోదు చేశారు. 47 ఎకరాల భూమిని ఆయన కబ్జా చేసినట్లుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎలక్షన్స్‌ టైమ్‌ లో రాత్రికి రాత్రే మా వద్ద నుంచి భూములు లాక్కొని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందులో ముఖ్య పాత్ర వహించిన ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డి పై కూడా ఫిర్యాదులు అందడంతో ఆయన మీద నాలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

మల్లారెడ్డి తో పాటు అతని అనుచరులు 9 మంది పై 420 చీటింగ్‌ కేసు (Cheating Case) తో పాటు ఎస్సీ, ఎస్టీ నమోదు అయ్యింది. శామీర్పేట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం..మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వే నంబర్‌
33,34,35 లో గల 47 ఎకరాల 18 గుంటల ఎస్టీ (లంబాడీ) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9
అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారని శామీర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది.

విచారణ చేపట్టిన పోలీసులు మాజీ మంత్రి, అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్)జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also read: సంక్రాంతికి 4,484 స్పెషల్ బస్సులు.. సాధారణ ఛార్జీలతోనే.. తెలంగాణ ఆర్టీసీ శుభవార్త!

Advertisment
తాజా కథనాలు