AP Deputy CM: ఏపీ డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు నమోదు.. ఎందుకంటే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ డిప్యూటీ సీఎం నారయణ స్వామిపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత మల్లు రవి ఆయనపై ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు నారాయణ స్వామిపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. By B Aravind 13 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలో కాంగ్రెస్ నేత మల్లు రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నారాయణ స్వామిపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అసలేం జరిగిందంటే.. సోనియాగాంధీ, చంద్రబాబు కలిసే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని హెలికాప్టర్ ప్రమాదంలో చంపారంటూ నారాయణ స్వామి సంచలన ఆరోపణలు చేశారు. Also read: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జనవరి 16న సుప్రీం కోర్టు కీలక తీర్పు రాజశేఖర్ రెడ్డి మరణంలో ఇప్పటికీ ప్రజ్లలో సందేహం ఉందని వ్యాఖ్యానించారు. ఆ సందేహాన్ని తీర్చే సామర్థ్యం సోనియాగాంధీకి గాని, చంద్రబాబుకు గాని లేదని అన్నారు. వైఎస్‌ఆరే చంద్రనాయుడికి రాజకీయ భిక్ష పెట్టారని తెలిపారు. సోనియాగాంధీ, చంద్రబాబు వీళ్లిద్దరు కలిసి ఆయన్ని హింసించారని.. పొట్టన పెట్టుకున్నారని ఆరోపణలు చేశారు. అలాగే ఎలాంటి తప్పు కూడా చేయని వైఎస్ జగన్‌ను పలు కేసుల్లో ఇరికించారని.. అన్యాయంగా 16 నెలల పాటు ఆయన్ని జెల్లో ఉంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చంద్రబాబు మనిషేనన్నారు. అంతేగాక రేవంత్ గెలుపు కోసం.. చంద్రబాబు డబ్బులు కూడా పంపారని నారాయణ స్వామి విమర్శించారు. అయితే ఇప్పుడు ఆయనపై తెలంగాణలో కేసు నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. Also Read: వాటిని మాకు మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ వినతి.. #telugu-news #telangana-news #ap-politics #ap-deputy-chief-minister-narayanaswamy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి