BREAKING: పంజాగుట్టలో కారు బీభత్సం.. అడ్డొచ్చిన వాళ్లపైకి ఎక్కించిన మందుబాబు

హైదరాబాద్ పంజాగుట్టలో మందు బాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ వచ్చిన ఓ యువకుడు రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీ కొట్టుకుంటూ ముందుకెళ్లాడు. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

New Update
BREAKING: పంజాగుట్టలో కారు బీభత్సం.. అడ్డొచ్చిన వాళ్లపైకి ఎక్కించిన మందుబాబు

BREAKING: హైదరాబాద్ పంజాగుట్టలో మందు బాబు హల్ చల్ చేశాడు. మద్యం సేవించి కారు నడుపుతు వచ్చిన ఓ యువకుడు నడి రోడ్డుపై హంగామా చేశాడు. పంజాగుట్ట ట్రాఫిక్ ఏరియాలో వేగంగా కారు నడుపుతూ అడ్డు వచ్చిన వారినీ ఢీ కొట్టుకుంటూ వెళ్లాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇది గమనించిన స్థానికులు అతని కారు వెంట పడ్డప్పటికీ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఒక వ్యక్తి టాప్ ఎక్కి కూర్చోగా అలాగే ముందుకు తీసుకెళ్లాడు. అయితే ఎట్టకేలకు కొంతమంది కలిపి అతడి కారుకు అడ్డుపడి దేహశుద్ధి చేశారు.

ఇది కూడా చదవండి : Telangana: రాష్ట్రంలో ఆ పదేళ్లు నియంత పాలన.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన  మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisment
తాజా కథనాలు