నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి! నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్‌లోనే చనిపోయారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారంతా హైదరాబాద్ వాసులు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. By Trinath 06 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Nandyal District : మృత్యువు ఏ క్షణం ఎటు వైపు నుంచి దూసుకొస్తుందో తెలియదు. రెప్పపాటు కాలంలో ప్రాణాలు గాల్లో ఎగిరిపోతాయి. ఏమరపాటు మృత్యు కౌగిల్లోకి తీసుకెళ్తుంది. అప్పటివరకు ఆనందంగా గడిపిన ఆ కుటుంబాలు ఒక్కసారి తీవ్ర విషాదంలోకి వెళ్లిపోతాయి. కన్నీరుమున్నిరుగా విలపిస్తాయి. ముఖ్యంగా రోడ్లపై జర్నీ(Road Journey) అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. రాత్రి ప్రయాణాలు(Night Journey) కచ్చితంగా రిస్కుతో కూడుకున్నవే. ఈ విషయం మరోసారి స్పష్టమైంది. నంద్యాల జిల్లా(Nandyal District) లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులు హైదరాబాద్ వాసులు: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీనీ కారు ఢికొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్‌లోనే చనిపోయారు. ఆళ్లగడ్డ(Allagadda) మండలం నల్లగట్ల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారంతా హైదరాబాద్ వాసులుగా తెలుస్తోంది. ట్రాఫిక్ అంతరాయం కాకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ఇక మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఇక మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. చనిపోయిన వారిలో రవీందర్‌తో అతడి భార్య లక్ష్మి, కుమారుడు బాల కిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్‌కిరణ్ ఉన్నారు. గత నెల 29న బాల కిరణ్-కావ్య(Bala Kiran - Kavya) కు వివాహం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఈ పెళ్లి జరిగింది. ఈనెల 3న శామీర్‌పేటలో ఘనంగా రిసెప్షన్ చేశారు. 4న కొత్త దంపతులను తీసుకుని వెంకన్న దర్శనానికి తిరుమల(Tirumala) కు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగడం తీవ్ర విషాదాన్ని నింపింది. Also Read : జూనియర్ ఎన్టీఆర్ గురించి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు! #andhra-pradesh #road-accident #hyderabad #nandyal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి