/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-jpg.webp)
ఈమధ్య చాలామంది వాహనాదారులు ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. రాంగ్‌రూట్‌లో వెళ్లడం, సిగ్నల్స్ పడ్డా కూడా ఆగకపోవడం, వేగంగా వాహనాన్ని నడపడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి చర్యలతో వాళ్ల ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. అయితే తాజాగా ఓ కారు ఏకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్‌నే ఢీకొట్టింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అవధ్ అనే ప్రాంతంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే అటువైపు నుంచి ఓ కారు ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లింది. అంతేకాదు ఆ కానిస్టేబుల్ కింద పడిపోయినప్పటికీ ఆ కారు నడిపే వ్యక్తి ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌కు తీవ్రంగా గాయాలాయ్యాయి. అక్కడి స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటీజన్లు ఆ వాహనాదారుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఇస్రో మరో విజయం.. జాబిల్లి కక్ష్య నుంచి భూకక్ష్య దిశగా ప్రొపల్షన్ మాడ్యుల్..
ఇదిలా ఉండగా.. దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇండియాలోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.
Also Read: ట్రెండింగ్ లో ఐటీ మినిస్టర్..కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ వెల్లువెత్తుతున్న ట్వీట్లు
लखनऊ के अवध चौराहे पर हादसा..
बेअन्दाज़ शख्स ने उल्टी दिशा में कार दौड़ाई और ट्रैफिक सिपाही पर चढ़ा दी
हादसे के बाद चालक कार लेकर भाग निकला, घायल सिपाही अस्पताल में भर्ती
पुलिस ने फुटेज की मदद से चालक अभिषेक दास को गिरफ्तार किया..@lkopolicepic.twitter.com/25izaQmiCc
— Suraj Shukla (@suraj_livee) December 4, 2023