CBI Charg Sheet: నీట్ లీక్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లీక్ మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. దీనిలో ఇప్పుడు కీలకపరిణామం చోటు చేసుకుంది. సీబీఐ 13 మంది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్‌షీటును కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. సీబీఐ ఇప్పటి వరకు 40 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో 15 మంది బీహార్ వాసులే ఉన్నారు. ఇందులో ఐదుగురు ఇన్విజిలేటర్లు, ఇద్దరు పరిశీలకులు, ఒక సెంటర్ సూపరింటెండెంట్, ఒక ఇ-రిక్షా డ్రైవర్, ఇద్దరు ఎగ్జామ్ రాసిన విద్యార్ధులు ఉన్నారు. నిందితులిద్దరూ భరత్‌పూర్ మెడికల్ కాలేజీ విద్యార్థులు కమార్ మంగళం బిష్ణోయ్, దీపేందర్ కుమార్‌లుగా గుర్తించారు. వీళ్లిద్దరూ గతంలో అరెస్టయిన ఇంజనీర్ పంకజ్ కుమార్ నీట్ పేపర్ ను దొంగిలించడంలో సాయం చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జంషెడ్‌పూర్‌కు (జార్ఖండ్)చెందిన 2017-బ్యాచ్ సివిల్ ఇంజనీర్ పంకజ్ కుమార్.. హజారీబాగ్‌లోని ఎన్టీయే ట్రంక్ నుంచి నీట్ పేపర్‌ను దొంగిలించాడని ఆరోపణలు రావడంతో అతడిని సీబీఐ కొన్నిరోజుల క్రితమే అరెస్టు చేసింది. దీంతో పాటూ సీబీఐ మొత్తం 48 చోట్ల సోదాలు నిర్వహించింది.
NEET: నీట్ వివాదంలో 13 మందిపై సీబీఐ ఛార్జ్ షీట్
నీట్ ఎగ్జామ్ వివాదంలో బీసీఐ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే కీలక నిందితులను అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా 13 మంది ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో సమర్పించింది. ఇందులో విద్యార్ధులు, తల్లిదండ్రులు, పేపర్ లీకేజ్ చేసిన వారు అందరూ ఉన్నారు.
New Update
Advertisment