Cancer: మసాలాలతో క్యాన్సర్‌కు మందు..మద్రాస్ ఐఐటీ ఘనత

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న రోగం క్యాన్సర్. జనాల అలవాట్లు, ఆహారం, వాతావరణ మార్పులు అన్నీ కలిసి క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. దీని కోసం భారత శాస్త్రవేత్తలు ఓ మందును కనుగొన్నారు. మసాలా దినుసులతో క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చని చెబుతున్నారు.

New Update
Cancer: మసాలాలతో క్యాన్సర్‌కు మందు..మద్రాస్ ఐఐటీ ఘనత

Cancer Medicine With Masala : కోవిడ్ ప్రపంచాన్ని రెండేళ్ళు మాత్రమే భయపెట్టింది కానీ క్యాన్సర్ భూతం మాత్రం కొనేళ్ళుగా భయపెడుతూనే ఉంది. దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆదంఓళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం గుండెపోటు తర్వాత అత్యధిక మరణాలు క్యాన్సర్‌వే అవుతున్నాయి. దీనికి పురుషులు, మహిళలూ తేడా లేకుండా అందరూ బలయిపోతున్నారు. మళ్ళీ ఇందులో రకరకాల క్యాన్సర్లు కూడా ఉన్నాయి. మహిళలకు అయితే గర్భాశయ, రొమ్మ క్యాన్సర్లు వస్తుంటే...మగవారు మాత్రం ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు.

క్యాన్సర్ మందు కనుగొన్న భారత శాస్త్రవేత్తలు..

కేన్సర్‌కు ఇప్పటి వరకు ప్రత్యేక మందు లేదు, చికిత్స అంతకంటే లేదు. చాలా కొద్ది మంది మాత్రమే ఈ మహమ్మారి బారి నుంచి బయటపడగలుగుతున్నారు. అది కూడా బాగా డబ్బులుండి...హైఫై వైద్యం చేయించుకోగలిగిన వారు అయితేనే. సామాన్య జనాలు అయితే ఈ రోగం తో ప్రాణాలు పోగొట్టుకోవలసిందే. అయితే ఈ వ్యాధికి భారత శాస్త్రవేత్తలు చెక్ పెట్టనున్నారు. మసాలా దినుసులతో క్యాన్సర్‌ను ఎదర్కోవచ్చునని నిరూపించారు. దీని మీద చేసిన ప్రయోగాల్లో సక్సెస్ అయ్యారు. మసాలాలతో తయారు చేసిన మందులను వాడితే క్యాన్సర్ తగ్గుతుందని చెబుతున్నారు. 2028 నుంచి ఈ మందును మార్కెట్లోకి తీసుకువస్తామని అంటున్నారు. భారతీయ మసాలతో తయారు చేసిన నానో మందులకు క్యాన్సర్‌ను ఎదుర్కొనే శక్తి ఉందని చెబుతున్నారు. ఊపిరితిత్తులు, రొమ్ము, పేగు, గర్భాశయ ముఖద్వారం, థైరాయిడ్, గొంతు కేన్సర్లపై ఇది ప్రభావం చూపుతుందని వివరించారు.

మద్రాస్ ఐఐటీకి పేటెంట్...

ఇప్పుడు కూడా క్యాన్సర్‌ కోసం కొన్ని మందులున్నాయి. ముందే చెప్పుకున్నాట్టు వీటి ప్రబావం చాలా తక్కువ. అది కూడా మొదటి స్టేజ్‌లో వాడితే ఫలితం ఉంటుంది. అదీకాక ఈ మందులతో క్యాన్సర్‌ కణాలతో పాటూ శరీరంలో ఉండే ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటున్నాయి. కానీ ఇప్పుడు మసాలా దినుసలతో తయారు చేసే ఔషధం ఆరోగ్య కణాల జోలికి వెళ్ళదు. వాటికి ఎటువంటి హాని కలిగించదు. ఈ మందులు జంతువుల మీద ప్రయోగించగా అవి సక్సెస్ అయ్యాయి. ఈ మందుల పేటెంట్ మద్రాస్ ఐఐటీ పొందింఇది. వీటి ధర, తయారీలాంటి అంశాలమీద ఐఐటీ కసరత్తులు చేస్తోంది. త్వరలోనే వీటిని మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ వేయనున్నారు.

Also Read:West bengal: సింహాలకు కూడా మతం రంగు..బలయిన అటవీశాఖాధికారి

Advertisment
Advertisment
తాజా కథనాలు