యూజీసీ నెట్ 2024 పరీక్షను రద్దు చేశారు. అది కూడా ఎగ్జామ్ జరిగిన మర్నాడే దానిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్టీయే మధ్య సమగ్రత లోపించిందని...అందుకే పరీక్ష జరిగిన విధానంలో అవకతవకలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తం అవడంతోనే పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 1,205 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 9లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. పారదర్శకతను కాపాడుకోవటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది.
మరోసారి యూజీసీ నెట్ ఎగ్జామ్‌ను కండక్ట్ చేస్తామని..దాని వివరాలను తొందరలోనే ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. పరీక్షలో జరిగిన మోసాలు, అవకతవకలను దర్యాప్తు చేసేందుకు సీబీఐకు అప్పగించామని చెప్పింది.
మరోవైపు నీట్ పేపర్ లీకేజీ మీద కూడా కేంద్రం స్పందించింది. సమయం కోల్పోయిన విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులు రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. పట్నాలో నీట్ అవకతవకలపై పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించింది.