Bharat-canada conflict:ఆ నగరాల్లో ఉంటున్న వారు జాగ్రత్త-మళ్ళీ కాలుదువ్విన కెనడా

భారత్‌లో ఉన్న తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని కెనడా అడ్వైజరీ జారీ చేసింది. సమస్య సద్దుమణుగుతోంది అనుకుంటున్న తరుణంలో కెనడా ఇలాంటి ప్రకటన చేయడం వివాదాస్పదం అవుతోంది. ఇది కచ్చితంగా కవ్వింపు చర్యేనని భారత్ మండిపడుతోంది.

Bharat-canada conflict:ఆ నగరాల్లో ఉంటున్న వారు జాగ్రత్త-మళ్ళీ కాలుదువ్విన కెనడా
New Update

భారత్-కెనడాల మధ్య తగువు మరింత పెరిగేలా కనిపిస్తోంది. భారత్ కామ్ గా ఉన్నా కెనడా మాత్రం ఊరుకునేట్టు లేదు. మొదటి నుంచి కయ్యానికి కాలు దువ్వుతున్న కెనడా మరోసారి కవ్వింపు చర్యలను చేసింది. భారత్ లో ఉన్న కెనడా వారు జాగ్రత్తగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది. అదీకాక భారత్ తమ దౌత్యాధికారులను తగ్గించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ముంబయ్, బెంగళూరు, చండీఘడ్ లలో అన్ని రకాల ఇన్- పర్శన్ సేవలను నిలిపేసినట్లు తెలిపింది.

భారత్ నుంచి కెనడా 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకుందని కెనడా ప్రకటించింది. కెనడా దౌత్యవేత్తలు భారత్‌ను వీడకపోతే వారి అధికారిక హోదాను రద్దు చేస్తామని భారత్ బెదిరించిందని అందుకే తమ అధికారులను ఉపసంహరించుకున్నామని కెనడా దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. దీంతో ఇండియా-కెనడాల మధ్య ఉన్న వియన్నా ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిదని ఆరోపించారు. అయితే కెనడా మాత్రం ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడదని తెలిపారు. తమ దేశస్థుల భద్రత మీద ఆందోళన ఉండడం వల్లనే 41 మంది దౌత్యవేత్తలను వారి కుటుంబాలను భారత్ నుంచి తరలించామని చెప్పారు.

Also Read:చంద్రబాబు కేసులను వచ్చే నెల 8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

రీసెంట్ గా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారత్‌లో మీడియా, సోషల్ మీడియాల్లో వ్యతిరేకత ఉంది. దీనివలన కెనడా వ్యతిరేక ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. కెనడియన్లకు బెదిరింపులు, వేధింపులు ఉండొచ్చు. అందుకే ఢిల్లీ, బెంగళూరు, చంఢీగడ్, ముంబయ్ ల్లో ఉండే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్ళేప్పుడు అప్రమత్తంగా ఉండండి అంటూ కెనడా తన అడ్వైజరీలో పేర్కొంది.

ఖలిస్థానీ ఉగ్రవాది హరదీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని వ్యాఱ్యలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం రుగులుకుంది. ఈ కేసు దర్యాప్తులో సహకరించాలని భారత్ ను కెనడా డిమాండ్ చేయడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తూ భారత్ పై నిందలు వేయడం సరికాదంటూ కెనడాకు చివాట్లు పెడుతూ మండిపడింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఆంక్షలు నెలకొన్నాయి. ఆ తర్వాత భారత్ కెనడా వీసా సర్వీసులను రద్దు చేసింది.

#india #canada #conflict #diplomats
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe