తక్కువ విద్యార్హతలున్న జాబ్‌కు ఎక్కువ క్వాలిఫైడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా.. తక్కువ విద్యార్హత ఉండే ఉద్యోగానికి ఎక్కువ విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చా అనేదానిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే అది అటెండర్ పోస్టు కాబట్టి క్కువ విద్యార్హత కలిగిన వ్యక్తులు ఆ విధులు నిర్వహించడం కష్టంగా ఉంటుందని.. ఈ నిర్ణయం వెనుక ఆచరణాత్మక అవరోధాలు ఉంటాయని.. హైకోర్టు తరపు స్టాండింగ్ కౌన్సెల్ స్వరూప్ తెలిపారు. అయితే ఆమె ఇప్పటి వరకూ ఇంటర్,డిగ్రీ పరీక్షలలో ఉత్తీర్ణత పొందలేదు కాబట్టి ఆమె ప్రస్తుత విద్యార్హత 10వ తరగతి మాత్రమే అవుతుందని పిటీషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కూమార్ అన్నారు. By B Aravind 25 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ఉద్యోగాలకు సంబంధించిన అర్హతల విషయంలో తెలంగాణ హైకోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తక్కువ విద్యార్హత ఉండే ఉద్యోగానికి ఎక్కువ విద్యార్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చా? అనే దానిపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. జాబ్ నోటిఫికేషన్‌లో ఇచ్చిన దానికంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్న ఓ వ్యక్తి ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయకుండా నిరోధించవచ్చా? అనే విషయంపై వివరణ కోరుతూ ఓ మహిళ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ (అటెండెంట్) జాబ్‌కు అప్లై చేసుకున్న ఆమెను ఇంటర్వ్యూకి పిలవకపోవడంపై ఆమె కోర్టును ఆశ్రయించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పదో తరగతి వరకు అర్హత కలిగిన ఉద్యోగం కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమె ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు పూర్తి చేసింది. దీంతో ఆమెను ఇంటర్వ్యూకి పిలవలేదు. ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఇతర అభ్యర్థులను కోర్టు సూపరింటెండెంట్ పిలిచారు. తనను మాత్రం ఎందుకు పిలవలేదని ఆమె పిటిషన్‌లో తెలిపింది.అయితే దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది.ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అయితే 10వ తరగతి కంటే ఎక్కువ విద్యార్హతలు ఉండకూడదు. ప్రకటనలో ఇచ్చింది అటెండర్ పోస్టు. కాబట్టి ఎక్కువ విద్యార్హత కలిగిన వ్యక్తులు అటెండర్ పోస్టు విధులు నిర్వహించడం కష్టంగా ఉంటుంది. అలాగే అధికారులు వారితో పని చేయించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది.అందుకే ఈ నిర్ణయం వెనుక ఆచరణాత్మక అవరోధాలు ఉంటాయని.. హైకోర్టు తరపు స్టాండింగ్ కౌన్సెల్ స్వరూప్ తెలిపారు. కానీ స్టాండింగ్ కౌన్సెల్ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఉన్నత విద్యార్హత కారణంగా ఒక వ్యక్తిని ఉద్యోగానికి తిరస్కరించడం అన్యాయమని పేర్కొంది. Also Read: చంపుతామని బెదిరిస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్.. పిటిషనర్ తరపు న్యాయవాది కొప్పుల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. 10వ తరగతి కంటే ఆమెకు ఎక్కువ విద్యార్హత పొందలేదలేదని.. ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలకు హాజరయ్యింది, కానీ ఆ పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత పొందలేదని చెప్పారు. అయితే ఇక్కడ బెంచ్ జోక్యం చేసుకొని.. అసలు ఆమె ఇంటర్మీడియట్ పరీక్షలు పాస్ కాకుండా డిగ్రీ పరీక్షకు ఎలా హాజరవుతుందని బెంచ్ ఆశ్చర్యపోయింది. దీనికి శ్రవణ్ కుమార్ స్పందిస్తూ.. ఆమె దూరవిద్య (డిస్టెన్స్ ఎడ్యుకేషన్) ద్వారా గ్రాడ్యుయేట్ కోర్సుకు అప్లై చేసుకుందని చెప్పారు. ఆమె ఇప్పటి వరకూ ఇంటర్,డిగ్రీ పరీక్షలలో ఉత్తీర్ణత పొందలేదు కాబట్టి ఆమె ప్రస్తుత విద్యార్హత 10వ తరగతి మాత్రమే అవుతుందని అంతకంటే ఎక్కువ కాదని చెప్పారు. దీంతో ఆమె సబార్డినేట్ పోస్టుకు అర్హత ప్రమాణాలకు సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే దీనిపై స్పందించిన ధర్మాసనం ఆమెను ఇంటర్యూకు పిలవాలని అధికారులకు ఆదేశించింది. కానీ ఆమె ఆ ఉద్యోగానికి ఎంపిక అయిందా కాలేదా అనే విషయాలు వెల్లడించకూడదని చెప్పింది. అలాగే ఎక్కువ విద్యార్హతలు ఉన్న వారిని తక్కువ విద్యార్హతలు ఉన్న పోస్టులకు సంబంధించి దూరం పెట్టడం లాంటి అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. #telugu-news #high-court #telangana-high-court #jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి