సోమవారం జరిగిన తెలంగాణ కేబినేట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 3 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ వేడుకలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యతను జిల్లా కలెక్టర్లకే అప్పగించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అలాగే వచ్చే సీజన్ నుంచి సన్నవడ్లకు MSP పై రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు
Also Read: కిర్గిస్థాన్ అల్లర్లపై సీఎం రేవంత్ ఆరా..