Hyderabad: రూ.200 ల కోసం గొడవ..2 కోట్లు ఖర్చు పెట్టినా దక్కని ప్రాణాలు!

రూ. 200 కోసం గొడవపడ్డ క్యాబ్‌ డ్రైవర్‌ జీవితం గాల్లో కలిసిపోయింది.రెండేళ్ల క్రితం వివేక్‌ అనే వ్యక్తి క్యాబ్‌ ఛార్జీ 900 అయితే 700 ఇవ్వగా అతనితో డ్రైవర్‌ వెంకటేశ్‌ గొడవపడ్డాడు.దీంతో వివేక్‌ అతని ఫ్రెండ్స్‌ వెంకటేశ్‌ని చితకబాదగా..అతను రెండేళ్లు కోమాలో ఉండి ఆదివారం చనిపోయాడు.

Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
New Update

Hyderabad: కేవలం రూ.200ల కోసం మొదలైన చిన్న గొడవ ఓ యువకుడి జీవితాన్ని శాశ్వతంగా అంధకారంలోకి నెట్టేసింది. ఒక్కడిని చేసి 20 మంది కలిసి చితకబాదడంతో అతడు రెండు సంవత్సరాల పాటు మంచం మీదే ఉండి చికిత్స తీసుకుంటూ చనిపోయాడు.ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఉప్పర్‌ పల్లిలో జరిగింది.

రెండు సంవత్సరాల క్రితం అంటే 2022 జులై 31వ తేదీ.. రాత్రి 11 గంటలకు వివేక్‌రెడ్డి అనే వ్యక్తి.. నగరంలోని బీఎన్‌రెడ్డినగర్‌ నుంచి రాజేంద్రనగర్‌ సమీపంలోని ఉప్పర్‌పల్లికి క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాడు. తీరా గమ్యం చేరాక... ఛార్జీ రూ.900 అయ్యిందని క్యాబ్‌ డ్రైవర్‌ వెంకటేష్‌ గౌడ్‌ (27) చెప్పగా.. వివేక్‌రెడ్డి రూ.700 మాత్రమే ఇచ్చాడు. మిగిలిన రూ. 200 కోసం ఇద్దరి మద్య గొడవ మొదలైంది. దీంతో వివేక్‌రెడ్డి తన స్నేహితులకు ఫోన్‌ చేసి రప్పించాడు. సుమారు 20 మంది వరకు వచ్చి, వెంకటేశ్‌గౌడ్‌ను క్రికెట్‌ బ్యాట్లు, వికెట్లతో చితకబాది.. బంగారు గొలుసు చోరీ చేయబోయాడంటూ వెంకటేష్‌ను రాజేంద్రనగర్‌ పోలీసులకు అప్పగించారు.

ఆ మర్నాడు ఉదయం 6 గంటలకు వెంకటేష్‌ పరిస్థితి విషమించడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడికి తరలించిన కొద్దిసేపటికే బాధితుడు కోమాలోకి వెళ్లాడు. దీంతో ఆస్పత్రిలో రెండేళ్లుగా చికిత్స పొందుతూ వెంకటేశ్‌ గౌడ్‌ ఆదివారం మృతి చెందాడు.

Also read: యూట్యూబర్లకు కేంద్రం ఊహించని షాక్.. త్వరలో కొత్త చట్టం!

#hyderabad #died #driver #cab #charge
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe