State Wise Election Results : ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ అధికారంలోకి రాగా.. మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ (BJP) విజయ భేరీ మోగించింది. ఇక మిజోరాంలో జెడ్‌పీఎం అధికార పీఠాన్ని దక్కించుకుంది. అయితే తెలంగాణలో తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ప్రకటించిన సంగతి తెలిసిందే. మిజోరంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలిపోయింది. జెడ్‌పీఎమ్ చీఫ్ లాల్డూహోమా సీఎం పదవి చేపట్టనున్నారు. ఇక మిగిలింది ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్,రాజస్థాన్ రాష్ట్రాలే. ఈ రాష్ట్రాల్లో బీజేపీ సీఎం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు.
Also Read: ఆ పదవికి రాజీనామా చేయనున్న రేవంత్ రెడ్డి..!
Also Read: ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన లేఖ.. ఏం రాశారంటే..
ఛత్తీస్‌గఢ్‌లో చాలామంది మళ్లీ కాంగ్రెస్ వస్తుందని అనుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వస్తున్నట్లు చూపించాయి. కానీ వాటిని తారుమారు చేస్తూ అనూహ్యంగా, బీజేపీ విజయం సాధించింది. అయితే ఛత్తీస్‌గఢ్‌కు ముఖ్యమంత్రి పదవి కోసం.. మాజీ సీఎం రమణసింగ్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లో మాజీ సీఎం వసుంధర రాజేతో సహా బాబా బాలక్‌నాథ్, దియాకుమారీలు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో సీఎంగా ఇంతకుముందు శివరాజ్ సింగ్ చౌహన్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా మళ్లీ సీఎం పదవికి ఆయన పేరే వినిపిస్తోంది. అయితే త్వరలోనే బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.