China: 'ఇల్లు కొంటే భార్య ఫ్రీ'.. వింత ప్రకటన ఇచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీ..

చైనాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్‌ పడిపోవడంతో.. ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ తమ ఇళ్లు అమ్ముడుపోవాలని.. 'ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి' అంటూ అడ్వర్టైస్‌మెంట్‌ ఇచ్చింది. దీనిపై సిరియస్ అయిన చైనీస్‌ రెగ్యులేటర్లు ఆ కంపెనీకి రూ.3 లక్షల ఫైన్ విధించారు.

New Update
China: 'ఇల్లు కొంటే భార్య ఫ్రీ'.. వింత ప్రకటన ఇచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీ..

ఏవైనా కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రకటనలు చేస్తుంటాయి. కొన్ని కంపెనీలు అయితే కస్టమార్లను ఆకర్షించేందుకు ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అని.. డిస్కౌంట్లు అని ఇలా వివిధ రకాల అడ్వర్టైస్‌మెంట్‌లు ఇస్తుంటారు. అయితే చైనాలోని టియాంజన్‌లో ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ మాత్రం చాలా విచిత్రంగా ప్రచారం చేసింది. వారి వద్ద ఉన్న ఇళ్లు అమ్ముడుపోవాలని.. ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి అంటూ అడ్వర్టైస్‌మెంట్‌ఇచ్చింది.

స్థానికులు సీరియస్ 

ఇల్లు కొంటే ఇంకా ఏదైన ఫ్రీగా ఇవ్వొచ్చు.. మరీ ఇలా భార్యలను ఇవ్వడం ఏంటీ అని అక్కడి స్థానికులు సీరియస్‌ అయ్యారు. అంతేకాదు ఈ ప్రకటన కూడా చైనీస్‌ రెగ్యులేటర్లకు నచ్చలేదు. ప్రజలను ఆకర్షించేందుకు ఈ విధంగా ప్రకటన ఇచ్చినందుకు ఆ కంపెనీపై రూ.3 లక్షల జరిమాన విధించారు. అలాగే జెజియాంగ్‌ ప్రావిన్స్‌లోని మరో కంపెనీ బంగారు కడ్డీలను ఇస్తామని ప్రకటించింది. రియల్‌ ఎస్టెట్‌ కంపెనీలు ఇలా ఎందుకు ప్రకటనలు ఇస్తున్నాయంటే.. ప్రస్తుతం అక్కడ రియల్‌ ఎస్టేట్‌ బాగా పడిపోయింది.

Also Read: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో విద్యార్థి బలవన్మరణం..

సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్

అంతేకాదు ఈ రియల్ ఎస్టేట్ సంక్షోభం చైనా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపింది. అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ఇళ్లను అమ్మేందుకు కొత్త కొత్త ఐడియాలతో ఇలా ప్రచారాలు చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి చైనాలో రియల్ ఎస్టెడ్‌ రంగం పడిపోవడం మొదలైంది. అనంతరం నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. ఎన్నో మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీలు కూడా కుప్పకూలిపోయాయి. ఈ ప్రభావంతో.. చైనాలోని నాలుగు సంపన్న నగరాల్లో ఇళ్ల ధరలు చాలా తక్కువ రేట్లకు పడిపోయాయి.

రెండేళ్ల పాటు తిరోగమనం

అలాగే కొత్త ఇళ్లు అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. అయితే ఈ రియల్ ఎస్టేట్ తిరోగమనం మరో రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ మాజీ హెడ్ షెంగ్ సాంగ్‌చెంగ్ అంచనా వేశారు. పదేళ్ల క్రితం రెండంకెల వృద్ధిని సాధించిన డ్రాగన్ దేశం.. నాలుగో త్రైమాసికంలో కేవలం 5.2 శాతం వృద్ధి నమోదైంది. ఆర్థికవేత్తలు అంచనా వేసినదానికంటే తక్కువ నమోదు కావడంతో చైనాకు షాక్ తగిలింది.

Also Read: ”నన్ను పెళ్లి చేసుకుంటావా”.. నిక్కీకి ట్రంప్‌ మద్దతుదారుని ప్రపోజల్‌!

Advertisment
తాజా కథనాలు