Vivo Y18t: వివో నుంచి బ్లాక్ బస్టర్ 5జీ ఫోన్.. కేవలం రూ.10 వేల లోపే! వివో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను తాజాగా రిలీజ్ చేసింది. వివో వై18టి 5జీ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. కంపెనీ దీనిని ఒకే వేరియంట్ లో తీసుకుంది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499గా ఉంది. దీనిని ఫ్లిప్ కార్ట్ లో కొనుక్కోవచ్చు. By Seetha Ram 13 Nov 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రముఖ టెక్ బ్రాండ్ వివో భారతదేశంలో కొత్త కొత్త ఫోన్లు లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. Vivo Y18t ని లాంచ్ చేసింది. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండానే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్ ఇ-స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీ, Unisoc చిప్‌సెట్‌తో లాంచ్ అయింది. అంతేకాకుండా 50MP ప్రధాన కెమెరా, IP54 రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ధర కూడా చాలా తక్కువగా ఉండటంతో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా సామాన్య ప్రియులను ఆకట్టుకుంటుంది. Also Read: Harish Rao: రేవంత్ కి త్వరలోనే 70MMలో సినిమా చూపిస్తాం..! Vivo Y18t price Also Read: Karnataka: అంబేద్కరే ఇస్లాంలోకి మారాలనుకున్నాడు! Vivo Y18t స్మార్ట్ ఫోన్ ఒకే వేరియంట్ లో లాంచ్ అయింది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ భారతదేశంలో రూ.9,499 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇది జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. Vivo Y18t specifications Also Read: AP Assembly:నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం Vivo Y18t స్మార్ట్ ఫోన్ 6.56 అంగుళాల HD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 840 నిట్‌ల గరిష్ట ప్రకాశానికి మద్దతు ఇస్తుంది. అలాగే Android 14 ఆధారంగా Funtouch OS 14ని నడుపుతుంది. ఈ ఫోన్ 4GB LPDDR4X RAM, 128GB eMMC 5.1 స్టోరేజ్ తో కూడిన Unisoc T612 చిప్‌సెట్‌లో పని చేస్తుంది. Vivo Y18t 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 0.08 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. Also Read: Train Accident: పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్...! సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్‌ను కలిగి ఉంది. సేఫ్టీ కోసం, ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP54గా రేటింగ్ కలిగి ఉంది. అతేకాకుండా ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. #tech-news #vivo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి