ఇంటర్నెట్ లేకపోయినా.. అమౌంట్ ట్రాన్సఫర్ చేయొచ్చు మచ్చా, ఎలాగంటే?

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే UPI ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. దీని కోసం మీరు మీ మొబైల్ నుంచి *99# అనే అధికారిక USSD కోడ్‌ను డయల్ చేయాలి. ఈ USSD కోడ్ ఉపయోగించడం ద్వారా మీరు ఏ బ్యాంకు అకౌంట్ కైనా డబ్బు పంపొచ్చు.

Upi payment
New Update

అరెరే.. అమౌంట్ ట్రాన్సఫర్ చేయాలి.. నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఎలా?. అని చాలా మంది కంగారు పడుతుంటారు. అత్యవసరంలో ఉన్న వారికి అర్జెంట్‌గా డబ్బులు పంపించాలంటే అదో పెద్ద తలనొప్పి. పోనీ రీఛార్జ్ చేసుకుందామా? అంటే అసలు నెట్ బ్యాలెన్సే లేకపోతే రీఛార్జ్ ఎలా చేసుకుంటాం అనే ఆలోచన కూడా ఆ టైంలో వస్తుంది. 

Also Read: చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.200 లకే 90 రోజుల వ్యాలిడిటీ!

దీంతో అవతలి వ్యక్తులు చాలా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు. డబ్బులు ఎలాగైనా పంపించాలి. దానికంటే ముందు నెట్ బ్యాలెన్స్ ఎలా అయినా వేసుకోవాలని తెగ కంగారుపడుతుంటారు. అయితే ఇప్పుడు అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ లేకుండా యూపీఐ ద్వారా డబ్బులు పంపించుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ ఉండగానే ఫోన్ నుంచి యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఓ సదుపాయాన్ని అందిస్తోంది.

Also Read: ICC ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జైషా..

ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో *99# అనే అధికారిక USSD కోడ్‌కు డయల్ చేయాలి. ఈ కోడ్‌ ఉపయోగించడం ద్వారా ఏ బ్యాంక్ అకౌంట్ కైనా అమౌంట్ ట్రాన్సఫర్ చేయొచ్చు. అయితే అమౌంట్ ట్రాన్సఫర్ మాత్రమే కాకుండా తీసుకోవడం కూడా చేయొచ్చు. అంతేకాకుండా బ్యాలెన్స్ చెకింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే యూపీఐ పిన్ నెంబర్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా యూపీఐకి సంబంధించి అనేక కార్యకలాపాలను చేసుకోవచ్చు. 

Also Read: సూపర్ బైక్.. లీటర్ పెట్రోల్‌తో 70 కి.మీ మైలేజ్, ధర చాలా తక్కువ!

దీని కోసం ఏం చేయాలి..?

ఫోన్‌లో *99# అనే USSD కోడ్‌కు డయల్ చేయాలి. ఆ తర్వాత ఫోన్‌లో 

Money Sending 
Receiving Money
Balance Inquiry
Your Information

Also Read: తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు

ఇలా కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు అమౌంట్ ట్రాన్సఫర్ చేయాలనుకుంటే అవతలి వ్యక్తి యూపీఐ అకౌంట్‌తో లింక్ అయిన ఫోన్ నెంబర్ కొట్టి పంపించుకోవచ్చు. ఇలా ఇంటర్నెట్ లేని సమయంలో డబ్బులు ఈజీగా ట్రాన్సఫర్ జరుగుతుంది.

#phone-pay #upi #google-pay
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe