Bharat Taxi: అందుబాటులోకి వచ్చిన భారత్‌ ట్యాక్సీ సేవలు

ప్రస్తుతం క్యాబ్‌ బుకింగ్ కోసం ర్యాపిడో, ఓలా, ఉబర్ లాంటి సేవలే అందుబాటులో ఉన్నాయి. దేశంలో తొలిసారిగా సహకార రంగంలో క్యాబ్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

New Update
Union Minister Amit Shah launches Bharat Taxi

Union Minister Amit Shah launches Bharat Taxi

ప్రస్తుతం క్యాబ్‌ బుకింగ్ కోసం ర్యాపిడో, ఓలా, ఉబర్ లాంటి సేవలే అందుబాటులో ఉన్నాయి. దేశంలో తొలిసారిగా సహకార రంగంలో క్యాబ్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 'భారత్‌ ట్యాక్సీ'ని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గురువారం ప్రారంభించారు. ముందుగా ఈ సేవలు ఢిల్లీ-ఎన్సీర్‌, గుజరాత్‌కు రానున్నాయి. ముడేళ్లలో దేశవ్యాప్తంగా వీటి సేవలు విస్తరించాలని కేంద్రం లక్ష్యం పెట్టుకుంది.    

ఈ యాప్‌తో డ్రైవర్ల ఆదాయం మరింత పెరుగుతుందని అమిత్ షా అన్నారు. భారత్‌ ట్యాక్సీ ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యకలాపాలు విజయవంతం కావడంతో పోటీగా ఉన్న క్యాబ్ సేవల సంస్థలు తమ కమీషన్‌ను తగ్గించుకున్నాయని తెలిపారు. వినియోగదారులకు ఉచిత రైడ్లతో సహా ఇతర ప్రోత్సాహకాలతో అందించినట్లు చెప్పారు. భారత్‌ ట్యాక్సీ తమ డ్రైవర్లకు ఇచ్చే యాజమాన్య హక్కును మరే ఇతర సంస్థ ఇవ్వడం లేదని తెలిపారు. 

Also Read: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అనురాగ్ ఠాకూర్‌పై నిషేధం ఎత్తివేత!

ఇదిలాఉండగా దేశంలో 8 అగ్రగ్రామి సహకార సంస్థలు కలిసి భారత్‌ ట్యాక్సీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చాయి. ఇందులో అమూల్, నాఫెడ్, నాబార్డ్, ఎన్‌డీడీబీ, ఎన్‌సీడీసీ, ఇఫ్కో, క్రిభ్కో, ఎన్‌సీఈఎల్‌ ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చే ఆదాయంలో ప్రతి రూ.100లో రూ.20 ఉంచుకుని, మిగతా రూ.80ని డ్రైవర్ల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తారు. అంతేకాదు తీసుకునే ఆ రూ.20ని కూడా డ్రైవర్ల కోసమే వాడుతారు.  

Also Read: ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు.. చరిత్రలో మొదటిసారిగా

ఈ ప్లాట్‌ఫామ్ నుంచి కార్లు, ఆటోలు, బైక్‌లను బుక్‌ చేసుకోవచ్చు. సున్నా కమిషన్, సర్జ్‌ ఫ్రీ ధరల మోడల్‌ ఆధారంగా భారత్‌ ట్యాక్సీ పనిచేస్తుంది. దీనిపై వచ్చే లాభాలను నేరుగా డ్రైవర్లకే పంపిణీ చేసేస్తారు. డ్రైవర్లకు ప్రమాద, ఆరోగ్య బీమా సదుపాయాలను ఇఫ్కో-టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందించనుంది. 

Advertisment
తాజా కథనాలు