/rtv/media/media_files/2026/02/05/india-nepal-2026-02-05-15-40-53.jpg)
ఇండియా- నేపాల్ మధ్య డైరెక్ట్ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ బస్సు భారతదేశ రాజధాని న్యూఢిల్లీ నుండి నేపాల్‌లోని బేనీ మున్సిపాలిటీ వరకు నడుస్తుంది. ఢిల్లీ నుండి బేనీకి చేరుకోవడానికి సుమారు 27 గంటల సమయం పడుతుంది. మొత్తం ప్రయాణ దూరం 1,400 కిలోమీటర్లు. ఇది టూరిస్టులకు మంచి అవకాశం. హిందూ, బౌద్ధమతస్థులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ముక్తినాథ్. ఇప్పటివరకు అక్కడికి వెళ్లాలంటే విమానాలు లేదా మల్టీ-లెగ్ ప్రయాణాలతో భక్తులు ఎంతో ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా భారత్-నేపాల్ సరిహద్దుల మధ్య ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి నేపాల్-భారత్ ఫ్రెండ్షిప్ బస్సు సర్వీసు ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య రైల్వే ప్రయాణాలు జరుగుతున్నప్పటికీ డైరెక్ట్ బస్సు సర్వీస్ ఇదే మొదటిసారి. జయనగర్-కుర్థా రైలు మార్గం ఇప్పటికే అందుబాటులో ఉండగా, రక్సాల్ నుండి ఖాట్మండు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి చర్చలు జరుగుతున్నాయి.
Good News: A direct bus service from Beni in Myagdi to New Delhi, India has come into operation starting yesterday. The bus reaches New Delhi in 30 hours, and this service is expected to further support and promote Nepal’s tourism sector. 😮
— Routine of Nepal banda (@RONBupdates) February 5, 2026
Source. CDO, Myagdi pic.twitter.com/SQAa8RLZVB
ప్రతిరోజూ ఉదయం 6:45 గంటలకు బేనీ నుండి బస్సు బయలుదేరుతుంది. న్యూఢిల్లీలోని సరోజినీ నగర్ నుండి ప్రతిరోజూ సాయంత్రం 4:00 గంటలకు బస్సు బయలుదేరుతుంది. ఢిల్లీ నుండి బేనీకి ఇండియన్ కరెన్సీ అయితే రూ.3,200 టికెట్ ధర. అదే బేనీ నుండి ఢిల్లీకి నేపాల్ కరెన్సీలో రూ.5,400. ఈ బస్సు అగ్రా, అయోధ్య, భైరవా, వాలింగ్, స్యాంగ్జా మీదుగా ప్రయాణిస్తుంది. బేనీకి చేరుకున్న తర్వాత, భక్తులు అక్కడి నుండి ట్యాక్సీ, జీపు లేదా స్థానిక బస్సుల ద్వారా కేవలం 3 నుండి 4 గంటల్లో ముక్తినాథ్ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ప్రయాణానికి పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఓటర్ ఐడీ లేదా ప్రభుత్వం గుర్తించిన ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది.
ఈ బస్సు సర్వీసును మోడరన్ ఎరా టూర్స్ అండ్ ట్రావెల్స్, సృష్టి యాతాయత్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్‌గా నిర్వహిస్తున్నాయి. సముద్ర మట్టానికి 3,710 మీటర్ల ఎత్తులో ఉండే ముక్తినాథ్ క్షేత్రానికి ఏటా లక్షలాది మంది భారతీయ భక్తులు వస్తుంటారు. ఈ నేరుగా బస్సు సర్వీసు వల్ల ప్రయాణ ఖర్చులు, సమయం గణనీయంగా తగ్గుతాయి.
నేపాల్ ఇండియా మధ్య మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి. వీటిని "రోటీ-బేటీ కా రిష్తా" అని పిలుస్తారు. అంటే ఆహారం, బంధుత్వం మధ్య ఉన్న బంధం అని అర్థం. ఇరు దేశాల మధ్య సంబంధాలకు 1950 నాటి 'శాంతి మరియు స్నేహ ఒప్పందం' పునాది. ఈ ఒప్పందం ప్రకారం, ఇరు దేశాల ప్రజలు వీసా లేకుండా ఒకరి దేశంలోకి మరొకరు ప్రవేశించవచ్చు. నేపాలీ పౌరులు భారతదేశంలో ఆస్తులు కొనవచ్చు, వ్యాపారాలు చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చేరవచ్చు.
నేపాల్‌కు భారతదేశమే అతిపెద్ద బిజినెస్ పాట్నర్. మోతీహారి (భారత్) నుండి అమలేఖ్‌గంజ్ (నేపాల్) వరకు ఉన్న పెట్రోలియం పైప్‌లైన్ ద్వారా నేపాల్‌కు ఇంధన సరఫరా జరుగుతోంది. 2025 చివరలో RBI చేసిన సంస్కరణల ప్రకారం, భారతీయ బ్యాంకులు నేపాల్ కంపెనీలకు భారతీయ రూపాయిల్లో లోన్లు ఇచ్చే వెసులుబాటు కల్పించాయి. మనతో నేపాల్‌కు సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ, కొన్ని సమస్యలు ఇరు దేశాల మధ్య అప్పుడప్పుడు ఉద్రిక్తతలకు దారితీస్తాయి. కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాల విషయంలో మ్యాప్‌ల చుట్టూ వివాదం ఉంది. నేపాల్‌లో చైనా పెట్టుబడులు పెరగడం భారత్‌కు భద్రతాపరమైన ఆందోళన కలిగిస్తోంది. నేపాల్ దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య అన్‌బ్యాలెన్స్‌గా ఉంది.
Follow Us