ఈ రోజు స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయంటే?

గత ఐదు రోజుల నుంచి కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లో ఉన్నాయి. లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు కాసేపటికే డీలా పడ్డాయి. స్కూటర్లలో నాణ్యత లేదని ఫిర్యాదులు రావడంతో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు నష్టాల బాట పడుతున్నాయి.

New Update
Stock Markets

గత ఐదు రోజుల నుంచి స్టాక్‌ మార్కెట్లు డీలా పడిపోయాయి. ఆఖరికి ఈ రోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ షేర్లు కూడా కుప్పకూలుతున్నాయి. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 239 పాయింట్ల లాభంతో 81926.99 వద్ద స్టార్ట్ అయ్యింది. గరిష్ఠాన్ని చేరి మళ్లీ నష్టాల బాట పట్టింది.

ఇది కూడా చూడండి: జమ్మూకశ్మీర్‌లో స్వతంత్ర అభ్యర్థుల జోరు

ఓలా స్కూటర్లపై..

962 పాయింట్ల నష్టంతో 80726 పాయింట్లకు చేరి.. చివరకు 638.45 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ఆగింది. నిఫ్టీ 218.85 పాయింట్ల నష్టంతో 24,795.75 దగ్గరే ఆగిపోయింది. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు అయితే పతనమవుతున్నాయి. విద్యుత్ స్కూటర్ల నాణ్యతపై సోషల్ మీడియాలో అధికంగా ఫిర్యాదులు నమోదు కావడంతో వీటి షేర్లు తగ్గుతున్నాయి. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: మేజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్!

ఈ రోజు ఎం అండ్ ఎం, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ లాభాల బాట పట్టాయి. కానీ అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, టైటాన్, అల్ట్రాటెక్, టాటా స్టీల్, రిలయన్స్ నష్టాల బాటలో నడిచాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో భాగంగా చమురు ధరలు బాగా పెరుగుతున్నాయి. కానీ యూఎస్ డాలర్ బలపడటంతో బంగారం ధరలు పడిపోతున్నాయి. 

ఇది కూడా చూడండి: Hair Fall: ఆహారంలో ఈ విత్తనాలు తీసుకుంటే మీ జుట్టు పెరగడం ఖాయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు